తన పెళ్లి గురించి రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు క్రేజీ సమాధానం ఇచ్చిన శృతిహాసన్..?

కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన అందం, అభినయంతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. కొంతకాలం సినిమాలకు దూరమైన శృతిహాసన్ మళ్లీ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చి వకీల్ సాబ్, క్రాక్ వంటి సినిమాలతో సూపర్ హిట్ అందుకుంది. శృతిహాసన్ నటిగా మాత్రమే కాకుండా సింగర్ గా కూడా తన టాలెంట్ నిరూపించుకుంది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శృతిహాసన్ తన అభిమానులతో చిట్ చాట్ చేస్తూ సినిమా విశేషాలతో పాటు తన వ్యక్తిగత విషయాల గురించి కూడా అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది.

ఈ క్రమంలో శృతిహాసన్ తన ప్రియుడు శాంతానుని కూడా పరిచయం చేసింది. ఈ క్రమంలో తన ప్రియుడంటే తనకు ఎంత ఇష్టమో కూడా తరచూ అభిమానులతో పంచుకుంటుంది. అయితే ఎన్నోసార్లు శృతిహాసన్ తన పెళ్లికి సంబంధించిన ప్రశ్నలను ఎదుర్కొంది. ఇటీవల కూడా శృతిహాసన్ మరొకసారి ఈ ప్రశ్నను ఎదుర్కొన్నారు. ఇటీవల ఒక ఇంగ్లీష్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రిపోర్టర్.. వృత్తిపరమైన విశేషాలతోపాటు శృతిహాసన్ వ్యక్తిగత విషయాల గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో రిపోర్టర్ శృతిహాసన్ ని మీ పెళ్లెప్పుడు? అని అడుగుతాడు. దీంతో శృతిహాసన్ మాట్లాడుతూ..” మీ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు” అని క్రేజీ రిప్లై ఇస్తుంది.

ప్రస్తుతం శృతిహాసన్ తెలుగు తమిళ్ భాషలలో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఈ అమ్మడు ప్రస్తుతం ప్రశాంత నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తిరగెక్కుతున్న సలార్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నారు. అంతేకాకుండా నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా, గోపీచంద్ మల్లినేని దర్శకత్వంలో దొరికేకుతున్న ఎన్బికె 107 సినిమాలో బాలయ్య కి జోడీగా శృతిహాసన్ నటిస్తోంది. ఈ రెండు సినిమాలు కూడా హిట్ అయితే శృతిహాసన్ హీరోయిన్ గా మళ్లీ టాప్ ప్లేస్ కి వెళ్తుంది.