డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న శ్రద్ధా కపూర్ సోదరుడు..

బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ సోదరుడు సిద్ధాంత్ కపూర్ తాజాగా డ్రగ్స్ కేసులో దొరికిపోయాడు. గత రాత్రి బెంగుళూరు లో రేవ్ పార్టీ జరుగుతున్న హోటల్ పై పోలీసులు దాడి చేయడంతో అందులో పలువురు డ్రగ్స్ సేవించినట్లు తెలిసింది.

అందులో సిద్ధాంత్ కపూర్ కూడా ఉండటంతో వారందరిని ఉల్సూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ విషయం గురించి సిద్ధాంత్ తండ్రి స్పందిస్తూ.. తన కొడుకుని అరెస్టు చేయలేదు అంటూ.. కేవలం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అని.. ఈ విషయం తనకు నమ్మశక్యంగా లేదని.. ఇలా జరిగే ఛాన్స్ లేదు అని అన్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ విషయం బాగా హాట్ టాపిక్ గా మారింది.