ప్రభాస్ సినిమాకు బిగ్ షాక్..సినిమా నుంచి తప్పుకున్న “RRR” నిర్మాత..!

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పలు సెన్సేషనల్ సినిమాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాల్లో నిన్ననే పాన్ ఇండియా మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ (కేజీఎఫ్ ఫేమ్) తో ప్రకటించిన భారీ సినిమానే “సలార్” దీని నుంచి అయితే నిన్ననే రిలీజ్ డేట్ పై ఒక బిగ్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది.

మరి ఇలా పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషన్ రేపుతున్న ప్రభాస్ తో సినిమా చేయడానికి ఏ నిర్మాత అయినా ముందుకొస్తాడు. ఇప్పటికీ కూడా చాలా మంది బాలీవుడ్ సినిమా నిర్మాతలు క్యూ లో ఉంటున్నారు. అయితే అనూహ్యంగా ప్రభాస్ సినిమాకి అయితే బిగ్ షాక్ తగిలింది.

ప్రభాస్ రానున్న రోజుల్లో చేయనున్న మారుతి ప్రాజెక్ట్ నుంచి ప్రముఖ నిర్మాత RRR సెన్సేషన్ డివివి దానయ్య ఈ సినిమాకి నిర్మాతగా ముందు ఓకే చేయగా ఇప్పుడు అనుకోని విధంగా తాను ఈ సినిమా నిర్మాణం నుంచి తప్పుకున్నట్టు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కారణం ఏంటి అనేది ఇంకా బయటకి రాలేదు కానీ ఆల్రెడీ అయితే పలు భారీ సెట్టింగ్స్ కూడా చేసారు.

అయినా తాను ఇప్పుడు ప్రొడక్షన్ నుంచి బయటకి వచ్చేసారని భోగట్టా.. అయితే ఈ సినిమా ఆగిపోయిందా అంటే లేదనే తెలుస్తోంది. డివివి ఎంటర్టైన్మెంట్స్ స్థానంలో రెండు ప్రముఖ నిర్మాణ సంస్థలు ఈ సినిమా చేసేందుకు ముందుకి వచ్చినట్లు ఇప్పుడు తెలుస్తోంది. దీనితో అయితే వారు ఈ సినిమా టేకప్ చెయ్యనున్నారట.

మరి ఆ ప్రొడక్షన్ హౌస్ లు ఏంటో అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఈ భారీ సినిమా ఒక కామెడి హారర్ థ్రిల్లర్ గా గ్రాండ్ విజువల్స్ తో ప్లాన్ చేస్తుండగా కోలీవుడ్ హాట్ హీరోయిన్ మాళవిక మోహనన్ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. అలాగే మరికొందరు యంగ్ హీరోయిన్స్ ఈ సినిమాలో చేయనున్నారు.