షాకింగ్ న్యూస్ : “ఓమిక్రాన్” కి సినిమాకి ఏంటి వేరే సంబంధం..?

కరోనాతో ఒక దరిద్రం పోయింది అనుకుంటే దానికి మరింత బలమైన దారిద్రంలా ఓమిక్రాన్ అనే కొత్త వేరియెంట్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికించడం స్టార్ట్ చేసింది. ఊహించని విధంగా ఈ కొత్త వేరియెంట్ ఇప్పుడప్పుడే ప్రపంచంలో ఎంటర్ అయ్యింది. మన దేశంలో కూడా ఆల్రెడీ రెండు కేసులు రావడంతో దేశ ప్రభుత్వం కూడా అలర్ట్ అవుతుంది.

మరి ఇంతలా సంచలనం రేపుతున్న ఈ “ఓమిక్రాన్ వేరియెంట్” కి అలాగే సినిమాలకు సంబంధం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక్కడ సంబంధం అంటే ఇది వచ్చాక కూడా ముందులా థియేటర్స్ మూసేస్తారు అని కాదు. ఇదే వైరల్ పేరుతో ఏకంగా ఓ సినిమా ఎప్పుడో వచ్చింది.

1963లో “ది ఓమిక్రాన్ వేరియెంట్” పేరుతో ఆల్రెడీ ఓ సినిమా ఉందని సోషల్ మీడియా అంతా చర్చ నడుస్తుంది. దీనిపై వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా పోస్ట్ చేసాడు. ఇంకో ఊహించని వార్త ఏమిటంటే ఈ సినిమాకి ట్యాగ్ ఏముందో తెలుసా..

“ది డే ఎర్త్ వస్ టర్నడ్ ఇంటూ ఏ సిమెట్రీ” అంటే దీనికి అర్ధం “ఈ భూమి అంతా శ్మశాన వాటికగా మారిన రోజు” ఇది వినడానికే భయంకరంగా ఉంది. మీకు కూడా డౌట్ ఉంటే గూగుల్ లో ఈ సినిమా పేరు సెర్చ్ చేసి చూస్తే అర్ధం అవుతుంది.