షాకింగ్ : ప్రభాస్ పై నెట్ ఫ్లిక్స్ లో ట్రోల్స్..ఆ హీరో ఫ్యాన్స్ సపోర్ట్.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ఒక్క పాన్ ఇండియా లెవెల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు వచ్చింది. మరి ఇప్పుడు కూడా మరిన్ని సినిమాలతో ప్రభాస్ ప్రపంచ ఆడియెన్స్ కి దగ్గర కూడా అవుతున్నాడు. అయితే అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు ప్రభాస్ పై అయితే ఓ షాకింగ్ పోస్ట్ వైరల్ గా మారింది.

ప్రభాస్ నటించిన భారీ చిత్రం సాహో హిందీలో నెట్ ఫ్లిక్స్ నుంచి గ్లోబల్ గా అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం నుంచి నెట్ ఫ్లిక్స్ ఇండోనేషియా వారు ఓ క్లిప్ ని షేర్ చేయగా దానిపై ఇప్పుడు దారుణంగా ట్రోల్స్ పడుతున్నాయి.

అందులో గ్రాఫిక్స్ కోసం అలాగే ప్రభాస్ జంప్ చేసి బాగ్ పట్టుకొని రావడం కోసం అయితే ట్రోల్స్ నడుస్తుండగా దీనికి స్టార్ హీరో షారుఖ్ ఖాన్ అభిమానులు సపోర్ట్ చెయ్యడం స్టార్ట్ చేశారు. ఇక దీనితో అయితే ప్రభాస్ ఫ్యాన్స్ రంగంలోకి దిగి అసలు ఆ సినిమాలో సీక్వెన్ బయట నిజంగా చేస్తారని దాన్ని బంజాయ్ స్కై డైవింగ్ అంటరాని ఒకొక్కరికి గట్టి కౌంటర్ లు అయితే ఇస్తున్నారు. దీనితో గత రెండు రోజులు కితం పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.