టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి షాక్ లు మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఐదారుగురు తేదాపా ఎమ్మెల్యేలు వైకాపా గూటికి చేరడానికి సిద్దమవుతున్నారు. అతి త్వరలోనే ఆ ఘట్టం పూర్తికానుంది. అదే జరిగితే టీడీపీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. అటుపై అసెంబ్లీ కెళ్లి చోద్యం చూడటం తప్ప చేసేదేమి ఉండదు. అప్పుడప్పుడు అసెంబ్లీలో కాలు కాలిన పిల్లిలా చిందులేసిన చంద్రబాబుకి ఆదీ కూడా దక్కదు. ఇక సైకిల్ దిగి ప్యాన్ కిందకు రావడానికి అదే పార్టీ నుంచి చాలా మంది సీనియర్ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. అదే జరిగితే పార్టీ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారుతుందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబుకు మరోషాక్ తగిలేలా కనిపిస్తోంది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి పితాని సత్యనారా యణ సైకిల్ దిగిపోవాలని ఫిక్స్ పోయారని అక్కడ స్థానికంగా చర్చకొచ్చింది. నెమ్6మదిగా బాబు ను వదిలించుకుని జగన్ పక్కన చేరాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయన సమాచారం. తన రాజకీయఅనుభవాన్ని, భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకునే పితాని వైకాపా నేతలతో పావులు కదుతపున్నట్లు మాట్లాడుకుంటున్నారు. ఆచంట నియోజక వర్గానికి చెందిన పితాని గతంలో కాంగ్రెస్ తరుపున విజయం సాధించి మంత్రి అయ్యారు. అటుపై చంద్రబాబు హయాంలో టీడీపీ లో చేరిన వెంటనే 2014లో విజయం సాధించారు.
2017 లో జరిగిన మంత్రి వర్గ విస్తరణలో మరోసారి మంత్రిగా పనిచేసారు. ఇలా దాదాపు నలుగురు ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనది. అయితే ప్రస్తుతం టీడీపీలో ఆయన పరిస్థితి బాగాలోదేటు. పార్టీ అధికారంలో లేకపోవడం.. అదే పార్టీ ఎమ్మెల్యేలకు జగన్ వైపు ఆకర్షితిలవ్వడం వంటి అంశాలపై పితాని ని కొన్ని రోజులుగా సీరియస్ గానే ఆలోచనలో పడేసాయట. దీనికి మించి అదే పార్టీలో కొనసాగితే తన సామాజిక వర్గమైన శెట్టి బలిజలో ప్రాబల్యం కోల్పోయే ప్రమాదం ఉందని భావిస్తున్నారుట.
ప్రస్తుతం వైసీపీ నుంచి ఆ స్థానాన్ని అదే సామాజిక వర్గానికి చెందిన కౌరు శ్రీనివాసు రాజకీయంగా దూసుకుపోతున్నారు.ఇది కూడా పితానికి మింగుడు పడని విషయం. ప్రస్తుతం ఆచంటలో మంత్రి చెరుకువాడ రంగనాథరాజు బలంగా ఉన్నప్పటికీ వయోభారం కారణంగా వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయగలరా? అన్న సందేహం పితానాని వైకాపా వైపు ఆకర్షితుడయ్యేలా చేస్తుందని సమాచారం. ఇలా అన్ని విషయాలు ఆలోచించుకునే భవిష్యత్ వైకాపాతోనే ఉందని భావించి ప్యాన్ కిందకు రావాలని చూస్తున్నారు