అక్కినేని కుటుంబాన్ని ఆ శాపం వెంటాడుతోందా.. అందుకే విడాకులు అంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ప్రత్యేకత ఉంది. అక్కినేని హీరోలు క్లాస్ సినిమాలలో నటిస్తూనే ఆ సినిమాల ద్వారా బ్లాక్ బస్టర్ హిట్లను ఖాతాలో వేసుకుంటున్నారు. అయితే అక్కినేని కుటుంబాన్ని ఒక శాపం వెంటాడుతోందని ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతుండటం గమనార్హం. అక్కినేని కుటుంబంలో విడాకుల గురించి అభిమానుల మధ్య సైతం జోరుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.

అక్కినేని ఫ్యామిలీని విడాకులు అనే శాపం, సెంటిమెంట్ వెంటాడుతోందని చాలామంది నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అక్కినేని కుటుంబంలో ఈ విధంగా జరగడానికి కారణమేమిటనే ప్రశ్నకు సైతం సమాధానం దొరకడం లేదు. వారసత్వంగా ఈ శాపం వెంటాడుతోందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. నాగార్జున రామానాయుడు కూతురు అయిన లక్ష్మీని వివాహం చేసుకున్నారు.

ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో వీళ్లిద్దరూ విడిపోయారని సమాచారం. తర్వాత రోజుల్లో నాగార్జున అమలను వివాహం చేసుకున్నారు. అక్కినేని సుమంత్ కీర్తి రెడ్డిని వివాహం చేసుకుని కొన్ని కారణాల వల్ల విడిపోయారు. అక్కినేని సుప్రియ సైతం చరణ్ రెడ్డి అనే వ్యక్తిని వివాహం చేసుకుని కొన్ని కారణాల వల్ల విడిపోయారు. అక్కినేని అఖిల్ శ్రియా భూపాల్ నిశ్చితార్థం జరుపుకోగా కొన్ని కారణాల వల్ల ఈ జంట పెళ్లి కాకుండానే విడిపోయారు.

అక్కినేని కుటుంబానికి చెందిన నాగచైతన్య సమంత విడిపోవడం అభిమానులను ఎంతగానో బాధపెట్టింది. అక్కినేని కుటుంబానికి ఏదో దోషం ఉందని అందువల్లే ఈ విధంగా జరుగుతోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నాగచైతన్య మరో వివాహం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.