విజయ్ “వరిసు” షాకింగ్ బిజినెస్..టోటల్ భారీ లెక్కలు ఎంతంటే.!

తమిళ నాట స్టార్ హీరో విజయ్ కి ఉన్న క్రేజ్ అయితే సౌత్ ఇండియా సినిమా దగ్గర ఏ హీరోకి లేదని చెప్పాలి. తన సినిమాల లెక్కలు ఆ రీచ్ అంతా ఒకోసారి ఫేక్ అన్నట్టు అనిపిస్తాయి కానీ తన సినిమాలకి సోషల్ మీడియాలో రీచ్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అందుకే విజయ్ సినిమాలకి భారీ డిమాండ్ కూడా ఉంది.

ఇక ఇప్పుడు అయితే తాను మన తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లితో ఓ చిత్రాన్ని చేస్తుండగా దీనికి తెలుగు మరియు తమిళ్ లో భారీ హైప్ సెట్టయ్యింది. ఈ క్రేజ్ తో అయితే వరిసు సినిమా రికార్డు స్థాయి బిజినెస్ ని చేసినట్టుగా సినీ వర్గాలు చెప్తున్నాయి.

ఈ చిత్రం తమిళ్ వెర్షన్ లో మొత్తం అన్ని హక్కులు కలిపి సుమారు 270 నుంచి 280 కోట్ల ఈజీ బిజినెస్ ని జరిపేసిందట. ఇక ఈ లెక్కల డీటెయిల్స్ చూస్తే.. తమిళ్ థియేట్రికల్ హక్కులు 72 కోట్లు, ఓవర్సీస్ 38 కోట్లు, డిజిటల్ హక్కులు 60, శాటిలైట్ 50, ఆడియో 10 అలాగే హిందీ 32 కోట్లు.

అలాగే కన్నడ మరియు తమిళ బిజినెస్ కలిపి 16 కోట్లు కాగా తెలుగు హక్కులు కాకుండా ఈ చిత్రం సుమారు 280 కోట్ల బిజినెస్ ని కొల్లగొట్టినట్టుగా తెలుస్తుంది. దీనితో అయితే ఈ చిత్రంతో దిల్ రాజు ఆల్రెడీ భారీ లాభాలు అందుకున్నట్టుగా సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇంకా ఈ సినిమాలో అయితే రష్మికా మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం ఇస్తున్నాడు.