షాకింగ్ : “భీమ్లా నాయక్” కి ఫస్ట్ హీరో పవన్ కాదట..మరెవరంటే!

ఈ ఏడాది టాలీవుడ్ సినిమా దగ్గర వచ్చిన హిట్ చిత్రాల్లో మొదటి 100 కోట్ల షేర్ చిత్రంగా స్టార్ట్ అయ్యిన చిత్రం “భీమ్లా నాయక్”. ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యిన ఈ చిత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో మాస్ అంచనాలు నెలకొల్పుకొని రిలీజ్ అయ్యింది.

యువ దర్శకుడు సాగర్ చంద్ర ఈ సినిమా తెరకెక్కించగా ఇప్పుడు ఈ సినిమాపై ఓ ఊహించని షాకింగ్ ఫ్యాక్ట్ ని స్వయంగా సినిమా నిర్మాతే రివీల్ చెయ్యడం ఆసక్తిగా మారింది. ఈ నిర్మాత నటసింహ బాలయ్య హోస్ట్ చేస్తున్న ఓటిటి షో అన్ స్టాప్పబుల్ 2 రెండో ఎపిసోడ్ లో పాల్గొనగా బాలయ్య భీమ్లా నాయక్ కోసం అడిగారు.

ఆ సినిమా ఫస్ట్ హీరో ఎవరు అని అడగ్గా వంశీ ఫస్ట్ హీరో మీరే కదా సార్ అని షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు. భీమ్లా నాయక్ ముందు మీతో చెయ్యాలని మీ చుట్టూ తిరిగితే మీరే కదా సార్ పవన్ కళ్యాణ్ గారికి బాగుంటుంది అని చెప్పారు అని తెలిపాడు. దీనితో ఈ ఊహించని ట్విస్ట్ విని పవన్ ఫ్యాన్స్ ఇప్పుడు ఖంగుతింటున్నారు. ఇలా మొత్తానికి అయితే పవన్ కన్నా ముందే బాలయ్య దగ్గరకి ఈ సినిమా వచ్చింది అని చెప్పాలి.