మంచు వారి కుటుంబం నుంచి లేటెస్ట్ గా రిలీజ్ అయ్యినటువంటి అవైటెడ్ చిత్రం “జిన్నా”. ఇక్కడ అవైటెడ్ ఎందుకు అనాల్సి వచ్చింది అంటే రీసెంట్ టైం లో మంచు ఫ్యామిలీ నుంచి కాస్త చెప్పుకోదగ్గ స్థాయిలో రిలీజ్ అయ్యిన మంచి బజ్ ఉన్న చిత్రం ఇదే కావడం విశేషం. హీరో మంచు విష్ణు సినిమాకి చెయ్యాల్సింది అంతా చేసి గట్టి ప్రమోషన్స్ నడుమ సినిమాని అయితే రిలీజ్ చేసుకున్నాడు.
ముందు పాన్ ఇండియా రిలీజ్ అనుకున్నాడు కానీ లాస్ట్ కి తెలుగు రిలీజ్ లోనే వచ్చాడు. అయితే ఈ సినిమా విషయంలో విష్ణు చాలా నమ్మకంగా ఉన్నాడు. మరి దానికి తగ్గట్టు తెలుగు స్టేట్స్ లో మంచి ఓపెనింగ్స్ వచ్చి ఉండొచ్చు ఏమో కానీ యూఎస్ లో అయితే ఆల్ టైం రికార్డు వసూళ్లు నమోదు చేసినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సినిమాకి యూఎస్ లో మొదటి రోజు ఏకంగా 18 టికెట్లు తెగాయట. దీనితో ఫస్ట్ డే 180 డాలర్స్ మేర వసూళ్లు అందుకుందట. దీనితో అసలు ఇంత తక్కువ వసూళ్లు అందుకున్న సినిమాగా జిన్నా ఆల్ టైం కొత్త రికార్డు నమోదు చేసినట్టుగా ట్రేడ్ తెలుపుతున్నారు.
ఇక ఆస్ట్రేలియా లో సినిమా రిలీజ్ కాగా అక్కడ కూడా కొన్ని లొకేషన్స్ లో రిలీజ్ అయ్యినా అక్కడ మాత్రం ఒక్క టికెట్ కూడా తెగలేదట. దీనితో జీరో వసూళ్లు నమోదు అయ్యినట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నారు. దీనితో జిన్నా వసూళ్లు ఓవర్సీస్ లో ఎలా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.