షాకింగ్ న్యూస్ : నటి రంభకి యాక్సిడెంట్..పూర్తి వివరాలు.!

తెలుగు సినిమా దగ్గర తన గ్లామర్ తో సంచలనం రేపిన సీనియర్ స్టార్ హీరోయిన్స్ లో నటి రంభ కూడా ఒకరు. హీరోయిన్ గానే కాకుండా ఐటం గర్ల్ గా కూడా ఎన్నో చిత్రాల్లో కనిపించి యూత్ ని కొల్లగొట్టిన ఈమె ఇక ఒక ఏజ్ వచ్చాక అయితే తాను సినిమాల నుంచి దూరం అయ్యి పర్సనల్ లైఫ్ ని లీడ్ చెయ్యడం స్టార్ట్ చేసింది.

అయితే రంభ కి మొత్తం ముగ్గురు పిల్లలు కాగా ఇప్పుడు ఓ షాకింగ్ న్యూస్ అయితే నేషనల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక మరిన్ని వివరాల్లోకి వెళితే రంభ పెద్ద కూతురు సాషా కెనడా లో చదువుకుంటుండడగా అక్కడ ఆమెకి ఊహించని విధంగా రోడ్డు ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది.

అయితే రంభనే కార్ డ్రైవ్ చేస్తుండగా కెనడా రోడ్ పై ఈ ప్రమాదం సంభవించినట్టుగా తెలిసింది. అయితే ఈ ప్రమాదం కి సంబంధించి కొన్ని విజువల్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా ఇప్పుడు వెంటనే ఈ వార్తలు కూడా స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి.

అయితే సాషా ఆరోగ్య పరిస్థితికి ఆమె పరిస్థితి హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటుండగా కాస్త సీరియస్ గానే ఉందట. ఇక రంభ కి స్వల్ప గాయాలు అయ్యాయట. మరి ఈ వార్తతో అయితే విన్న వారు వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.