టీడీపీకి షాక్.. ట్విట్టర్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు!

ఆంధ్ర ప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ తాజాగా సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కుకుంది. ఎలాన్ మస్క్ కు చెందిన ‘స్పేస్ ఎక్స్’ ఫోటోలను అందులో షేర్ చేశారు. అంతేకాకుండా అర్థం కాని విచిత్రమైన ట్వీట్ లను కూడా చేస్తున్నట్లు తెలిసింది. తాజాగా ఈ విషయం గురించి టీడీపీ ప్రకటించింది.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఈ విషయం గురించి తన ట్విట్టర్ వేదికగా తెలిపాడు. తమ అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయిందని అన్నారు. ఇక ట్విట్టర్ ఇండియా సహకారంతో తమ ఖాతాను పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపాడు. ఇక ఈ విషయం గురించి పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా స్పందించారు.