రాజ్ కుంద్రా.. ఇప్పుడీ పేరుకి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు ఈయన వ్యాపారవేత్త. ఇప్పుడేమో పోర్న్ వీడియోల రాకెట్ నిందితుడు. నిందితుడు కాస్తా దోషిగా నిరూపితమయ్యే అవకాశముందా.? ఏళ్ళ తరబడి ఎటూ కేసు విచారణ సాగుతుంది గనుక, అప్పటిదాకా, ‘నిందితుడు’ అనే ట్యాగ్ ఆయనకు అదనపు ఆకర్షణ అవుతుందా.? ఏమోగానీ, రాజ్ కుంద్రాతో శిల్పా శెట్టి విడిపోనుందనీ, ఇప్పటికే విడాకుల ప్రక్రియ షురూ అయ్యిందనీ కొద్ది రోజుల క్రితం ప్రచారం జరగడం, ఆ ప్రచారానికి భిన్నంగా.. ఇటీవల జైలు నుంచి విడుదలైన రాజ్ కుంద్రాని ఎంతో భావోద్వేగానికి గురవుతూ ఇంటి వద్ద శిల్పా శెట్టి స్వాగతం పకడం.. అందర్నీ విస్మయానికి గురిచేసింది. రాజ్ కుంద్రా అరెస్టవడంతో, శిల్పా శెట్టి చాలా ఆదాయం కోల్పోయింది. ఇది అందరికీ తెలిసిన విషయమే.
శిల్పా శెట్టి అనే బ్రాండ్ సర్వనాశనమైపోయింది, ఆమె భర్త రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్ నిర్వాహకుడనే ఆరోపణల కారణంగా. అయితే, గతం గతః అంటూ శిల్పా శెట్టి సర్దుకుపోవడం అంత తేలికేనా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. రాజ్ కుంద్రా నుంచి 119 బూతు వీడియోల్ని స్వాధీనం చేసుకున్నామని ముంబై పోలీసులు చెబుతున్నారు. అయితే, పోర్న్ వీడియోలు కలిగి వుండడం నేరం కాదు.. వాటిని, ఎవరికైనా బలవంతంగా చూపిస్తే, అక్కడ బాధితులెవరైనా వుంటే.. అలా వీడియోలు చూపించడం నేరం. వీడియోల చిత్రీకరణ కూడా నేరమే. రాజ్ కుంద్రా, వీడియోల్ని చిత్రీకరించాడనిగానీ, చిత్రీకరణకు సహకరించాడనిగానీ నిరూపితమవడం అంత తేలిక కాదు. ఇవన్నీ తెలుసు గనకనే శిల్పా శెట్టి కాస్త నెమ్మదించిందట, భర్త రాజ్ కుంద్రాతో విడాకుల విషయమై. రాజ్ కుంద్రా మాత్రం షరామామూలుగానే తాను అమాయకుడినని చెబుతున్నాడు.