భ‌యం క‌లిగిన మ‌నిషిగా రాజ‌శేఖ‌ర్‌.. ఫ‌స్ట్‌లుక్‌తో ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తున్న సీనియ‌ర్ హీరో

సీనియర్ హీరో రాజ‌శేఖ‌ర్ త‌న కెరీర్‌లో ఎన్నో వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన సంగ‌తి తెలిసిందే. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీని ప్రాణంగా ప్రేమించే రాజ‌శేఖ‌ర్‌కు ఈ సినిమా ఇండ‌స్ట్రీ జీవిత రూపంలో మంచి భార్య‌ను కూడా అందించింది. పెళ్ళైన‌ప్ప‌టి నుండి ఇప్ప‌టి వ‌రకు క‌ష్ట‌సుఖాలలో చేదోడువాదోడుగా ఉంటూ అభిమానుల‌కు ఆద‌ర్శంగా నిలుస్తూ వస్తున్నారు. ఒక‌ప్పుడు మంచి హిట్ సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని థ్రిల్ చేసిన రాజ‌శేఖ‌ర్ మ‌ధ్య‌లో కొంత గ్యాప్ తీసుకున్నారు. గ‌రుడ వేగ సినిమాతో తిరిగి రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా భారీ హిట్ కావ‌డంతో వెంట‌నే క‌ల్కి అనే చిత్రం చేశారు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది.

ఈ రోజు రాజ‌శేఖ‌ర్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆయ‌న కొత్త మూవీకి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న విడుద‌లైంది. రాజ‌శేఖ‌ర్ 91వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాకు ‘శేఖ‌ర్‌’ అనే టైటిల్ ఫిక్స్ చేయ‌గా, దీనికి మేన్ విత్ స్కేర్(భయం కలిగి ఉన్న మనిషి అనే అర్థం) అనే క్యాప్ష‌న్ ఇచ్చారు. లలిత్ అనే దర్శకుడు సినిమాను తెరకెక్కించబోతున్నాడు. టు స్టేట్స్ నిర్మాత ఎంఎల్‌వీ స‌త్య‌నారాయ‌ణ‌తో పాటు త‌మ్మారెడ్డి భ‌రద్వాజ‌, వెంక‌ట‌శ్రీనివాస్ బొగ్గారం, రాజ‌శేఖ‌ర్ త‌న‌యలు శివాని, శివాత్మిక త‌దిత‌రులు ఈ సినిమా నిర్మాణంలో భాగం కాబోతున్నారు.

శేఖ‌ర్ మూవీకి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌లో రాజ‌శేఖ‌ర్ తెల్ల‌ని గుబురు గ‌డ్డంతో సీరియ‌స్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. ఈ చిత్రం మ‌ల‌యాళ మూవీకి రీమేక్ అని తెలుస్తుంది. అనూప్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించిన మోష‌న్ పోస్ట‌ర్ కూడా విడుద‌ల కాగా, ఇది కూడా ఎంతో ఆక‌ట్టుకుంటుంది. అయితే కోవిడ్ వ‌ల‌న చావు స‌రిహ‌ద్దుల వ‌ర‌కు వెళ్లొచ్చిన తాను ఈ రోజు బ‌ర్త్‌డే జ‌రుపుకోవడం, త‌న సినిమాకు సంబంధించిన ప్ర‌క‌న‌ట చేయ‌డం అభిమానుల ప్రేమ‌, అభిమానం, ఆద‌ర‌ణ వ‌ల‌న‌నే సాధ్య‌మైంద‌ని పేర్కొన్నాడు. రాజ‌శేఖ‌ర్ స‌తీమ‌ణి జీవిత ఒక‌ప్పుడు టాప్ హీరోయిన్ కాగా,ఇప్పుడు వారి కూతుళ్లు ఇద్ద‌రు ఇండ‌స్ట్రీలో హీరోయిన్‌గా రాణించేందుకు క‌స‌ర‌త్తులు చేస్తున్నారు.