అతనితో బెడ్ షేర్ చేసుకున్న.. అబార్షన్ చేయించుకున్న.. నటి కామెంట్స్ వైరల్!

బాలీవుడ్ ముద్దుగుమ్మ కుబ్రా సైట్ గురించి మనందరికి తెలిసిందే. సల్మాన్ ఖాన్ నటించిన రెడీ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇది నిన్న తర్వాత వచ్చిన సేక్రెడ్ గేమ్స్ అనే ఒక వెబ్ సీరిస్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుంది. అదేవిధంగా సుల్తాన్,జవానీ జానేమన్, సిటీ ఆఫ్ లైఫ్ వంటి తదితర సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈమె ఓపెన్ బుక్: నాట్ ఏ కువైట్ మెమోయిర్ అనే పుస్తకాన్ని రాసింది. జూన్‌ 27న విడుదలైన ఈ పుస్తకంలో తన పర్సనల్‌ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాల గురించి రాసుకొచ్చినట్లు ఆమె తెలిపింది.

అలాగే బాడీ షేమింగ్, వన్‌ నైట్‌ స్టాండ్‌, అబార్షన్‌, లైంగిక వేధింపులు వంటి తదితర ఆసక్తికర విషయాలను గుర్తు చేసుకుంది. ఒక ఇంటర్వ్యూలో కుబ్రా సైట్ నా 30 ఏళ్లప్పుడు 2013లో అండమాన్‌ పర్యటనకు వెళ్లాను. స్కూబా డైవింగ్ సెషన్‌ తర్వాత కొన్ని డ్రింక్స్‌ తీసుకున్నాను. తర్వాత ఒక స్నేహితుడితో బెడ్‌ షేర్ చేసుకున్నాను. శారీరకంగా కలిశాను. కొన్నాళ్లకు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోగా పాజిటివ్‌ అని తేలింది. వారం రోజుల తర్వాత అబార్షన్‌ చేయించుకోవాలనుకున్నాను. నేను తల్లిని కావడానికి సిద్ధంగా లేను. నేను ఊహించుకున్నట్లుగా నా జీవిత ప్రయాణం సాగట్లేదు.

అంతే కాకుండా ఆమె ఇప్పటికీ కూడా సిద్ధంగా ఉన్నానని అనుకోవట్లేదని,అమ్మాయిలకు 23 ఏళ్లకే పెళ్లి చేసుకోవాలి. 30 ఏళ్లకు పిల్లలను కనాలి వంటి విషయాలు తనకు అర్థం కావు అని చెప్పుకొచ్చింది ఈ ముద్దు గుమ్మ. అలాగే అబార్షన్‌ చేయించుకున్నప్పటికీ ఆమెకు తప్పు చేశాను అన్న భావన లేదని తెలిపింది. ఆ విషయంలో ఎలాంటి పశ్చాత్తాపం లేదు. నా ఛాయిస్‌ నాకు ఉంటుంది. ప్రస్తుతం నా ఆలోచనల్లో క్లారిటీ ఉందనుకుంటున్నాను. ఈ విషయాలను ఇలా షేర్ చేసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేదని భావిస్తున్నాను. అందుకే ఈ పుస్తకాన్ని రాశాను. గతంలో జరిగిన సంఘటనల నుంచి కొన్ని విషయాలను నేర్చుకున్నాను. బాడీ షేమింగ్‌కు గురయ్యాను. నా కుటుంబానికి సన్నిహితంగా ఉండే వ్యక్తి లైంగికంగా వేధించేవాడు. మళ్లీ అలాంటి పరిస్థితులు ఎదురైతే నేను వ్యవహరించే తీరు వేరే విధంగా ఉంటుంది. నేను రాసిన పుస్తకంలో 24 చాప్టర్స్‌ ఉంటాయి. ప్రతి చాప్టర్ చదివించేలా ఆసక్తికరంగా ఉంటుంది అని తెలిపింది. అయితే ఇదే విషయంపై అభిమానులు ఆమెను తిట్టిపోస్తున్నారు.