Kranthi Balivaada: ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన చాలామంది మొదట్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారని నటి క్రాంతి బలివాడ అన్నారు. తాను డబ్బింగ్ నుంచి ఇక్కడికి వచ్చాను కాబట్టి తాను కంఫర్ట్ పొజిషన్‌లోనే ఉన్నానని ఆమె చెప్పుకొచ్చారు. ఇక్కడికి వచ్చే వాళ్లలో చాలా మంది మంచిగా చదువుకొనే వస్తారని అలాంటి వాళ్లలో డైరెక్టర్లతో పాటు, అసోసియేట్ డైరెక్టర్లు కూడా ఉంటారని ఆమె అన్నారు. కానీ వచ్చిన మొదట్లో మనం ఎవరో తెలియదు కాబట్టి, మనకు ఐడెంటిటీ చాలా ముఖ్యమని ఆమె చెప్పారు. ఒక్కోసారి అది మనం చేసే రోల్ పైన కూడా ఆధారపడి ఉంటుందని, అంటే చిన్న క్యారెక్టర్ చేస్తే ఒకలా, పెద్ద క్యారెక్టర్ చేస్తే ఒకలా అని ఆమె తెలిపారు.
ఇకపోతే తాను ఇప్పటివరకు ఇండస్ట్రీలో బాగా హర్ట్ అయిన సందర్భాన్ని ఆమె ఈ విధంగా పంచుకున్నారు. తాను ఓ సినిమా షూటింగ్ సమయంలో ఉన్నపుడు తన కో-ఆర్టిస్ట్ ఒకామె మాట్లాడే విధానం తనకు నచ్చకపోయేదని ఆమె అన్నారు. తాను ఆ సినిమాకు ఫ్రెషర్ అని ఆమె చెప్పుకొచ్చారు. కెమెరామెన్ తన కెమెరా సెట్ చేసుకోవడంలో భాగంగా అందరి మీద కెమెరా సెట్ అయిందా లేదా అని చూసుకుంటారు. అది కామన్. అలా అతను చేస్తున్నపుడు ఎవర్నైనా చూసినపుడు తన కో-ఆర్టిస్ట్ ఆయన్ని అందరి ముందూ పిలిచి, ఏయ్ ఏంటలా చూస్తున్నవ్ ? నచ్చిందా ? అని అడిగేదని ఆమె చెప్పారు. అలా మాట్లాడడం చాలా ఛీప్‌గా ఉంటుందని, అది ఫ్రొఫెషనలిజం కాదని ఆమె అన్నారు. తనకు నిజంగా ఆమె అలా మాట్లాడడం చాలా అసహ్యంగా అనిపించిందని ఆమె చెప్పారు.
తాను అప్పుడే వచ్చానని, తనకేం తెలియవని అందుకే ఏం మాట్లాడలేక సైలెంట్‌గా ఉండేదాన్నని క్రాంతి అన్నారు. అదే మూవీలో చేస్తున్నపుడే అలా రెండు సార్లు చేసిందని ఆమె చెప్పారు. ఆ తర్వాత కెమెరామెన్ ఆమె దగ్గరికొచ్చి మీరు ఇలా మాట్లాడకూడదు అని చెప్తే అలా మాట్లాడడం ఆపేందని ఆమె అన్నారు. కానీ ఆమె అలా మాట్లాడడం చాలా ఇబ్బందిగా, చికాకుగా అనిపించిందన్న క్రాంతి, పబ్లిక్‌లో ఒక మనిషిని టార్గెట్ చేయడం అనేది తనకు నచ్చలేదని ఆమె చెప్పారు.