తెలంగాణ రాజకీయాల్లో కాక రేపిన వైఎస్ షర్మిల

Sharmila Makes Massive Impact Finally
Sharmila Makes Massive Impact Finally
 
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల, తెలంగాణ రాజకీయాల్లో కాక రేపారు. మంత్రి కేటీయార్‌ని ఉద్దేశించి, ‘కేటీయార్ అంటే ఎవరు.?’ అని ప్రశ్నించి, చిన్న గ్యాప్ తర్వాత, కేసీయార్ కొడుకే కదా.. అని షర్మిల చేసిన వ్యాఖ్యలతో పెను రాజకీయ దుమారం రేగింది.
 
హరీష్ రావు మీద షర్మిల చేసిన కామెంట్లు కూడా వైరల్ అవుతున్నాయి. అన్నిటికీ మించి, తన అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో విభేదాల్లేవని షర్మిల వ్యాఖ్యానించడంతో ఇప్పటిదాకా ఆమె విషయంలో కొంత డైలమాలో వున్న వైసీపీ అభిమానులూ యాక్టివ్ అయ్యారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ విషయంలో. అన్నకు తగ్గ చెల్లెలు.. తండ్రికి తగ్గ తనయ.. అంటూ షర్మిలపై వైసీపీ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
 
సోషల్ మీడియా వేదికగా షర్మిల వీడియోల్ని వైరల్ చేసేస్తున్నారు. దానికి అట్నుంచి కౌంటర్ కూడా గట్టిగానే వస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతుదారులు బూతులు తిడుతున్నారు షర్మిలని. తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన సోసల్ మీడియా విభాగం కూడా ఇప్పటికే షర్మిలకు స్వీట్ వార్నింగ్ ఇస్తోంది.
 
రేవంత్ రెడ్డి, బండి సంజయ్.. వంటి నేతల హంగామా నడుమ, షర్మిల తన ఉనికిని కాపాడుకుని, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సందడి చేయాలంటే, తప్పదు.. ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సిందేనేమో. కానీ, ‘పెద్ద మొగోడు..’ అంటూ కేటీయార్ గురించి షర్మిల చేసిన వ్యాఖ్యలు కొంత అభ్యంతరకరంగా మారాయి.. వాటి పట్ల షర్మిల విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. ఏదిఏమైనా, ఓ ప్రెస్ మీట్ పెట్టి షర్మిల, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్ని అనూహ్యంగా తనవైపుకు తిప్పేసుకున్నారన్నది నిర్వివాదాంశం.