Y.S.Sharmila: గడప దాటని వైయస్ షర్మిల… జగనన్నను విమర్శించడానికి వస్తారా?

Y.S.Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంచి అవకాశాన్ని మిస్ చేసుకుంటున్నారా అంటే అవుననే చెప్పాలి. ఈమె ఎన్నికలకు ముందు ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్నారు. ఇలా ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ తనని గెలిపించడం కంటే కూడా జగనన్నను ఓడించండి అంటూ ఈమె ప్రచారం చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది..

ఇలా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అనే ఈమె కోరిక ఎంతో విజయవంతంగా తీరిందని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలల అవుతుంది అయితే ఈ తొమ్మిది నెలల కాలంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా దిగ్విజయంగా అమలు చేయలేకపోతున్నారు కానీ షర్మిల మాత్రం చాలా మౌనంగా ఉండి చూస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై కాస్త నెగిటివిటీ వచ్చింది ఈ నెగిటివిటీని క్యాష్ చేసుకొని తన పార్టీని బలోపేతం చేసుకునే విషయంలో షర్మిల పూర్తిగా వెనుకబడిపోయారు.

ఇలాంటి సమయంలో ఈమె బయటకు వస్తే తమ పార్టీపై కాస్త సానుభూతి పెరిగి పార్టీ బలపరచడానికి కారణం అవుతుంది కానీ షర్మిల మాత్రం మౌనంగా ఉండడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ విషయంపై కొంతమంది స్పందిస్తూ ఈమె కేవలం జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి మాత్రమే బయటకు వస్తారు గత ఐదు సంవత్సరాల కాలంలో జగనన్న అమలు చేయని కొన్ని హామీలను ప్రశ్నిస్తూ మీడియా ముందుకు వస్తారే తప్ప ఇప్పుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చని కూటమిని మాత్రం ప్రశ్నించడానికి షర్మిలకు సమయం లేదు అంటూ విమర్శలు కురిపిస్తున్నారు. మరి ఇప్పటికైనా షర్మిల బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ బలపరిచే విధంగా పనిచేస్తారా మాట ఇచ్చి మాట తప్పిన కూటమిని ప్రశ్నిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.