రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా కేసీఆర్ కు ఫోన్ చేసిన శరద్ పవార్..

ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికల గురించి జోరుగా ప్రచారాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల విపక్షాల తరపున బరిలో దిగుతున్న యశ్వంత్ సిన్హా కు మద్దతు ఇవ్వాలి అని ఎన్సీపీ అధినేత శరద్ పవర్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరారు.

రాష్ట్రపతి ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పేరు ప్రకటించిన వెంటనే శరద్ వెంటనే కేసీఆర్ కు ఫోన్ చేసి ఆయన ఎంపిక గురించి పూర్తిగా తెలియజేశారు. అంతేకాకుండా ఇరవై రెండు పార్టీలు అభ్యర్థిత్వానికి మద్ధతి ఇచ్చాయని అన్నారు. దీంతో ఆయన కేసీఆర్ ప్రభుత్వం నుంచి మద్దతు కోసం ఆయనకు ఫోన్ చేశారు.