ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆస్పత్రిలో చేరారు. పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్న ఆయనను ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రికి తరలించారు. ఆదివారం సాయంత్రం కడపులో నొప్పి కారణంగా ఆయన అసౌకర్యానికి గురయ్యారు. దీంతో వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఎన్సీపీ నాయకుడు నవాబ్ మాలిక్ ట్విట్టర్‌లో ఒక ప్రకటన చేశారు. ఆయనకు పరీక్షల నిర్వహించిన అనంతరం పిత్తాశయంలో సమస్య ఉన్నట్టుగా వైద్యు నిర్ధారించారని చెప్పారు.
ఇక, చికిత్స నిమిత్తం శరద్ పవార్ బుధవారం ఆస్పత్రిలో చేరనున్నారు. అక్కడ ఆయనకు ఎండోస్కోపి, శస్త్ర చికిత్స నిర్వహించనున్నట్టు మాలిక్ తెలిపారు. తదుపరి నోటీసులు వచ్చేవరకు ఆయన అన్ని కార్యక్రమాలను రద్దు చేసినట్టు చెప్పారు. ఇక, శరద్ పవార్ అహ్మదాబాద్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో అహ్మదాబాద్‌లో రహస్యంగా భేటీ అయ్యారన్న వార్తలు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. శనివారం అహ్మదాబాద్‌లోని ఓ పారిశ్రామికవేత్త ఇంటిలో వీరిద్దరు సమావేశమయినట్టు ప్రచారం జరిగింది.
ఇదే విషయాన్ని మీడియా ప్రతినిధులు.. అమిత్‌షాను ప్రశ్నించినప్పుడు అన్ని విషయాలను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని అన్నారు. మరోవైపు అమిత్ షాతో శరద్ పవార్ భేటీ అయ్యారనే వార్తను ఎన్సీపీ నేతలు ఖండించారు. దీంతో రాజకీయ వర్గాల్లో పలు ఇక, షెడ్యూల్ ప్రకారం శరద్ పవార్ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ తరఫున ప్రచారం నిర్వహించాల్సి ఉంది. ఏప్రిల్ 1న బెంగాల్ వెళ్లి.. మూడు రోజుల పాటు అక్కడ ప్రచారం పాల్గొనాల్సి ఉంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆ పర్యటన రద్దు కానుంది.
ఊహాగానాలు నడుస్తున్నాయి.