ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. అలాగే, నేడు 81వ పుట్టిన రోజు జరుపుకుంటున్న ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ కు కూడా మోదీ బర్త్ డే విషెస్ తెలిపారు.
ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. శరద్ పవార్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను’ అని ప్రధాని ట్వీట్ చేశారు. మరాఠా యోధుడు శరద్ పవార్ 1940, డిసెంబర్ 12న మహారాష్ట్రలోని పుణెలో జన్మించారు.
కాగా, రాజకీయాల్లోకి రాబోతున్నట్టు ప్రకటించిన రజనీకాంత్‌కు ఈ బర్త్‌డే ప్రత్యేకంగా నిలవనుంది. తన పార్టీ పేరును కూడా రిజిస్ట్రేషన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ నెల 31న పార్టీ పేరు, గుర్తును వెల్లడించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రజనీకాంత్ పార్టీ పోటీ చేసే అవకాశం ఉంది.
రజనీకాంత్ గత ఆగస్టులో 45 ఏండ్ల తన సినీ జీవితాన్ని పూర్తిచేసుకున్నారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశిస్తున్నానని డిసెంబర్ 4న ప్రకటించారు. తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీని ఈనెల చివర్లో ప్రకటిస్తామని తెలిపారు.