ఆ డైలాగ్ డైరెక్టర్ చెప్పమంటే చెప్పాను.. అంతకుమించి నాకేం తెలియదు: షణ్ముఖ్ జశ్వంత్

సోషల్ మీడియా ద్వారా స్టార్ గా మారిన షణ్ముఖ్ జశ్వంత్ అందరికీ పరిచయం ఉన్న సెలబ్రెటీ. యూట్యూబ్ వీడియోలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న షణ్ముఖ్ బిగ్ బాస్ లో అడుగుపెట్టి మరింత పరిచయం పెంచుకున్నాడు. ఇక ఈయన తాజాగా ఏజెంట్ ఆనంద్ అనే ఓ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక ఇది ఆహాలో స్ట్రీమ్ కానుంది.

దీంతో షణ్ముఖ్ కొన్ని విషయాలు పంచుకున్నాడు. బిగ్ బాస్ కంటే ముందు ఈ సిరీస్ రెడీగా ఉందని.. అలా ఆ షో తర్వాత చేయాలనుకున్నానని అన్నాడు. ఈ సిరీస్ యూట్యూబ్లో చేద్దామనుకున్నాను అంటూ.. కానీ ఆహా నుండి ఆఫర్ వచ్చిందని.. చాలా సంతోషకరమైన విషయమని తెలిపాడు. ఇక ఈ సీరిస్ లో మనసు తప్ప ఏదైనా వెతికి ఇచ్చేస్తాను అనే డైలాగు డైరెక్టర్ చెప్పమంటే చెప్పాను.. అంతకుమించి తనకేం తెలియదని అన్నాడు. తను బాగా డిప్రెషన్ లో ఉన్న సమయంలో హీరో సూర్యను కలవడం వల్ల అందులో నుంచి బయటపడ్డానని అన్నాడు.