జబర్దస్త్ కొత్త యాంకర్ కు బారీ అవమానం..మరి అలా తీసిపడేసారేంటి బయ్యా?

బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమానికి ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు. ఈ కార్యక్రమం మొదట్లో నాగబాబు రోజ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమానికి అనసూయ రష్మీ యాంకర్లుగా వ్యవహరిస్తూ తమ మాట తీరుతో తమ గ్లామర్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో హైపర్ ఆది సుడిగాలి సుదీర్ వంటి కంటెస్టెంట్లు సైతం కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను తమదైన శైలిలో సందడి చేశారు. అయితే గత కొత్త కాలం నుంచి జబర్దస్త్ కార్యక్రమంలో వరసగా వలసలు మొదలయ్యాయి.

ఇలా ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నాగబాబు రోజా సుదీర్ హైపర్ ఆది వంటి వాళ్ళందరూ వరుసగా బయటకు వెళ్లారు.ఇకపోతే జబర్దస్త్ కార్యక్రమానికి వీరందరూ వెళ్లిపోయిన అనసూయ స్పెషల్ అట్రాక్షన్ గా ఉంది తన గ్లామర్ ద్వారా షో నీ ముందుకు నడిపించారు. అయితే ప్రస్తుతం ఈమె కూడా ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్నారు.ఇక అనసూయ ఈ కార్యక్రమం నుంచి వెళ్లిపోవడంతో కొత్త యాంకర్ ఎవరు అనే ప్రస్తావన మొదలైంది.అయితే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేసినప్పటికీ ఇందులో కొత్త యాంకర్ వస్తున్నట్లు చూపించారు. కానీ ఆమె మొహం కనబడకుండా దాచేయడంతో కొత్త యాంకర్ ఎవరు అని అందరిలోనూ ఆత్రుత మొదలైంది.

ఈమె ఎవరు చూపించకపోయినప్పటికీ అనసూయ స్థానంలో యాంకర్ మంజుష రాబోతున్నట్లు సమాచారం. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మంజుష రెమ్యూనరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతుంది.ఈ కార్యక్రమంలో అనసూయ ఒక ఎపిసోడ్ కు దాదాపు 5 లక్షల వరకు రెమ్యూనరేషన్ చెల్లించేవారు. అయితే మంజుషకి మాత్రం చాలా తక్కువగా కేవలం రెండు లక్షలు మాత్రమే ఇస్తున్నారని ఇలా అనసూయతో పోలుస్తూ మంజూషకు భారీ అవమానం జరిగిందని పెద్ద ఎత్తున నెటిజన్లు భావిస్తున్నారు. అయితే ఈమె తన మాట తీరుతో ప్రేక్షకులను సందడి చేస్తే తప్పకుండా తనకు రెమ్యూనరేషన్ పెంచుతామని మల్లెమాలవారు తెలిపినట్లు సమాచారం.