Sharuk Khan: ఇంటి నేమ్ బోర్డ్ కోసం అన్ని లక్షలు ఖర్చు చేసిన షారుక్.. ఈ డబ్బుతో మరో ఇంటిని కట్టొచ్చు?

Sharuk Khan: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.గత మూడు సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న షారుక్ ఖాన్ ఈ ఏడాది దీపికా పదుకొనేతో కలిసి పఠాన్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇకపోతే ముంబైలో షారుక్ ఖాన్ నివసిస్తున్నటువంటి ఇల్లు మన్నత్ అంటే తనకు ఎంత ఇష్టమో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తనకు ఎంతో ఇష్టమైన ఇంటిని మరమ్మత్తులు చేస్తూ తనకు నచ్చిన విధంగా షారుక్ ఖాన్ మార్చుకుంటూ ఉంటారు.

తాజాగా షారుఖ్ ఖాన్ తన ఇంటి మరమ్మతు పనులను చేయించారు. ఈ క్రమంలోనే తన ఇంటికి నేమ్ బోర్డు పెట్టడం కోసం భారీగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. తనకెంతో ఇష్టమైన ఇంటి కోసం షారుక్ ఖాన్ మన్నత్ ల్యాండ్స్ ఎండ్ అంటూ నిలువు అక్షరాలతో నేమ్ ప్లేట్ డిజైన్ చేయించారు. అయితే ఈ నేమ్ బోర్డు కోసం భారీ మొత్తంలో ఖర్చు చేయడం ప్రస్తుతం బీ టౌన్ లో చర్చనీయాంశంగా మారింది.

ఇక ఈ నేమ్ బోర్డును షారుఖ్ భార్య గౌరీ ఖాన్ ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు సమాచారం.షారూఖ్ కుటుంబానికి సరిపోయేలా క్లాసీ టచ్ ఇచ్చేందుకే నేమ్ ప్లేటుకు అక్షరాల 25 లక్షల రూపాయలను ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ విధంగానే బోర్డు కోసం ఈ రేంజ్ లో ఖర్చు పెట్టడంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ విషయం తెలిసిన ఎంతో మంది నెటిజన్లు కేవలం ఇంటి నేమ్ బోర్డు కోసం ఖర్చు చేసిన డబ్బుతో ఎంతో విలాసవంతమైన ఇంటిని కట్టుకోవచ్చని పలువురు కామెంట్లు చేస్తున్నారు.