Shahid Kapoor: బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎన్నో సినిమాలలో నటించి విశేష ఆదరణ దక్కించుకున్నారు. ఈక్రమంలోనే తెలుగులో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం జెర్సీ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాను హిందీలో రీమేక్ చేశారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలోనే షాహిద్ కపూర్ హీరోగా ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేశారు.
క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో షాహిద్ కపూర్ క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో బాల్ తన పెదవికి తగిలి సుమారు 25 కుట్లు పడినట్లు గతంలో వెల్లడించారు. ఈ క్రమంలోనే చిత్రబృందం ఈ సినిమా మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో భాగంగా షాహిద్ కపూర్ పెదవికి గాయమై రక్తం కారుతున్న సన్నివేశాన్ని కూడా మనం చూడవచ్చు. ప్రస్తుతం చిత్ర బృందం విడుదల చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ఈ వీడియో పై నటుడు షాహిద్ కపూర్ అతని భార్య స్పందించారు. ఈ సందర్భంగా షాహిద్ స్పందిస్తూ..ఈ సినిమాకి నా రక్తాన్ని చిందించాను అనే క్యాప్షన్ జోడించారు. ఇక షాహిద్ కపూర్ వ్యాఖ్యలకు తన భార్య కూడా మద్దతు తెలిపారు. ఇదిలా ఉండగా షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ కపూర్ స్పందిస్తూ… సినిమా పట్ల నీకున్న ఇష్టానికి నీ ధైర్యానికి ఇదొక నిదర్శనం. నిన్ను చూసి ఎంతో గర్వపడుతున్నాను అంటూ స్పందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.