‘పఠాన్’ కోసం హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్.

పఠాన్ సినిమాను భారీ ఎత్తున నిర్మించేందుకు నిర్మాత ఆదిత్య చోప్రా, దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. షారుఖ్ ఖాన్, దీపిక పదుకొణె, జాన్ అబ్రహం కాంబినేషనలో రాబోతోన్న ఈ చిత్రాన్ని విజువల్ వండర్‌గా, యాక్షన్ థ్రిల్లర్‌గా, స్పై యూనివర్స్‌లో ది బెస్ట్ చిత్రంగా తెరకెక్కించాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఇండియన్ మూవీ లవర్స్‌ను ఆశ్చర్యపరిచేలాంటి అప్డేట్‌ను మేకర్లు ఇప్పుడు ప్రకటించారు. ఈ సినిమాలో టామ్ క్రూజ్‌తో కనెక్ట్ అయ్యేలా సీన్స్ ఉంటాయట.

ఈ మేరకు దర్శకుడు సిద్దార్థ్ మాట్లాడుతూ.. షారుఖ్ ఖాన్ లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్‌తో ఇలాంటి ఓ విజువల్ వండర్, యాక్షన్ సీక్వెన్స్ తీస్తుంటే దానికి తగ్గ విజన్ ఉన్న టీం మనకు అవసరం పడుతుంది. సరిగ్గా అలాంటి ఓ టీం మాకు దొరికింది. టామ్ క్రూజ్ కోసం పని చేసిన కాసీ ఓ నీల్ మాతో పని చేసేందుకు సిద్దమయ్యారు’ అని చెప్పుకొచ్చారు.

హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ అయిన కాసీ ఓ నీల్.. ఎమ్మి అవార్డుకు కూడా నామినేట్ అయ్యారు. జాక్ రీచర్, మిషన్ ఇంపాజిబుల్, టాప్ గన్ మార్వెరిక్, మార్వెల్ స్టూడియో, స్టీవెన్ స్పీల్‌బర్గ్ చిత్రాలకు కాసీ ఓ నీల్ పని చేశారు.

హాలీవుడ్‌లో ఆయన చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లకు ఏ మాత్రం తగ్గకుండా పఠాన్ సినిమా కోసం పని చేస్తున్నారు. ఆయన ఇప్పటి వరకు పఠాన్ సినిమా కోసం చేసింది చూస్తే కచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. ఈ చిత్రం జనవరి 25న విడుదల కాబోతోంది.. ఇప్పుడు ఈ సినిమా గురించి ఇంత కంటే ఎక్కువగా చెప్పలేను అంటూ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ పేర్కొన్నారు.

క్యాసీ.. ఏడు సార్లు గిల్డ్ అవార్డుకు, టారస్ వరల్డ్ స్టంట్ అవార్డ్‌కు మూడుసార్లు నామినేట్ అయ్యారు. కెప్టెన్ అమెరికా వింటర్ సోల్జర్, మిషన్ ఇంపాజిబుల్ ఘోస్ట్ ప్రోటోకాల్ వంటి సినిమాలకు పని చేశారు. ఆయన పనితనంతో అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్‌లో మెంబర్ షిప్‌ను కూడా సంపాదించుకున్నారు. హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో పఠాన్ సినిమా జనవరి 25న రాబోతోంది.