ఎన్టీఆర్‌కు విల‌న్‌గా త‌మిళ హీరో ఫిక్స్ అయిన‌ట్టేనా..?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్.. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఆర్ఆర్ఆర్ కోసం దాదాపు ఏడాదికి పైగానే స‌మ‌యం కేటాయించాడు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్‌ని కొమురం భీంగా చూపించ‌నున్న జ‌క్క‌న్న ఆయ‌న స్థాయిని పెంచే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ఎన్టీఆర్‌కు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చిత్రంతో జూనియర్ రేంజ్ మార‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఆర్ఆర్ఆర్ నుండి ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన లుక్స్ ఇప్ప‌టికే విడుద‌ల కాగా, ఇవి ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆకట్టుకున్నాయి. అక్టోబ‌ర్ 13న విడుద‌ల కానున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ 30వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకి అయిన‌ను పోయి రావ‌లె హ‌స్తిన‌కు అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తుంది. ఈ మూవీ షూటింగ్ మ‌రి కొద్ది రోజుల‌లో మొద‌లు కానుండ‌గా, ఇందులో విల‌న్‌గా తమిళ సూపర్ స్టార్ విజయ్ సేతుపతి నటిస్తారని ప్రచారం సాగుతోంది. ఇటీవల విడుద‌లైన ఉప్పెన చిత్రంలో సేతుపతి విలనిజంకు ప్రశంసలు కురిసాయి. ఆయన తప్ప ఇంకెవరూ ఆ పాత్రకు సరిపోరు! అంటూ ప్రశంసించారు. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకు కూడా విజ‌య్ సేతుప‌తి క‌రెక్ట్ ప‌ర్స‌న్ అని అంటున్నారు.

చిరంజీవి, చ‌ర‌ణ్‌ల‌తో పాటు ప‌లువురు హీరోలు కూడా విజ‌య్ సేతుప‌తి డేట్స్ కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న‌ట్టు తెలుస్తుంది. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ తాజా చిత్రంలోనూ సేతుపతికి అవకాశం దక్కింది. కానీ కాల్షీట్లు సర్ధుబాటు కాకపోవడంతో అతడు నటించడం లేదని తెలిసింది.తార‌క్ సినిమాకు విజ‌య్ సేతుప‌తి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే ఎన్టీఆర్ .. కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ పాన్ ఇండియా సినిమా చేయ‌నున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఈ మూవీకి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. ఈ ఏడాదే ఆ మూవీ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది.