తెలంగాణ రాష్ర్టం కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాట కొత్తేం కాదు. సొంత పార్టీ నేతలమధ్యే అధిపత్యపోరు నడుస్తోంది. సీనియర్లు-జూనియర్లు అని మొత్తానికి పార్టీ మనుగణే లేకుండా చేస్తున్నారు కొందరు నేతలు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఆ రకంగా కొంత మంచే జరుగుతుంది. ఆ రాష్ర్టంలో కాంగ్రెస్ బలహీనమవ్వడానికి అదీ ఓ కారణమన్నది వాస్తవం. పైకి అంతా ఒకటేనని చెబుతన్నా పదవుల కోసం వర్గాలుగా చీలిపోతున్నారనడానికి ఎన్నో ఉదహారణలున్నాయి. ఇక రేవంత్ రెడ్డి ఎంట్రీతో సీనియర్స్ అంతా మొదటి నుంచి మూతి బింగించే ఉన్నారు. ఇక పీసీసీ రేసులో రేవంత్ పేరు తెరపైకి రావడంతో ఆ సీన్ ఇంకా వేడెక్కుతోంది.
గట్టిగా మాట్లాడే నాయకుడొచ్చినా…రేవంత్ కి సొంత పార్టీలోనే సరైన మద్దతు దక్కడం లేదు. అయినప్పటికీ వన్ మ్యాన్ ఆర్మీలో పోరాటం చేసుకుంటూ కాస్తో…కూస్తో కాంగ్రెస్ కి ఓ ఐడెంటిటీ అనేది తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే అదిష్టానం దృష్టి రేవంత్ పై పడింది. కాంగ్రెస్ అదిష్టానంలోనూ నూతన నాయకత్వం మొదలైంది. అమ్మ సోనియాగాంధీ దూరంగా ఉండటం..రాహుల్ కాన్సంట్రేట్ చేయకపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో ఆ బాధ్యతల్ని ప్రియాంక గాంధీ తీసుకుంది. ఇటీవల రాజాస్థాన్ కాంగ్రెస్ పార్టీ లో తలెత్తిన సంక్షోభాన్నీ ప్రియాంక అందర్నీ ఒకేతాటిపైకి తీసుకొచ్చి సెటిల్ చేసింది.
ఈ నేపథ్యంలో తెలంగాణ పీసీసీ పదవికి ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డికి కట్టబెట్టనున్నారని ప్రచారం సాగుతోంది. ఇక అంతకు ముందు నుంచే ఆ పదివి తనదేనంటూ రెవంత్ రెడ్డి ప్రమోట్ చేసుకుంటున్నట్లు, ఆ పార్టీ నుంచి కాబోయే సీఎం అతనేనంటూ ప్రచారంలోకి వచ్చిన నేపథ్యంలో సీనియర్ నేతైన వి. హనుమంతురావు సీనియర్లను వదిలేసి..జూనియర్లకు ఎలా ఇస్తారని…ఈ సంగతేంటో అదిష్టానం ముందే తేల్చుకుంటానంటూ అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. మరి పీసీసీ ఎవరికి దక్కుతుంతో? సీఎం ఎవరు అవుతారో? అదిష్టానం చూపు ఎవరిపై ఉందో? తెలియాలంటే టైమ్ పడుతుంది.