Senior Star Donated : ఏకంగా 117 ఎకరాలు దానం చేసిన సీనియర్ నటుడు..కానీ అసలు నిజం ఏమిటంటే!

Senior Star Donated : ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ఏదైనా వార్త అయితే నిజం కానీ లేదా అబద్దం అవ్వని ఓ రేంజ్ లో వైరల్ అవుతుంటాయి. మరి అందులో ఎంత మేర నిజం ఉందొ లేదో తెలిసే లోపే ఆల్ మోస్ట్ అదే నిజం అని ప్రజలు నమ్మే పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. మరి అలాంటి ఒక వార్తే ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో మరియు సోషల్ మీడియాలలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.

ఇంతకీ అసలు మేటర్ ఏమిటంటే టాలీవుడ్ మరియు కోలీవుడ్ సీనియర్ ప్రముఖ నటుడు అయ్యినటువంటి హీరో సుమన్ తాజాగా భారత ఆర్మీ కోసం తనది ఏకంగా 117 ఎకరాల భూమిని దానం చేసాడని టాక్ పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. నిన్న ఉదయం నుంచి కూడా సోషల్ మీడియాలలో ప్రచారం అవుతున్న వార్తలు పై సుమన్ స్పందించినట్టు గా సినీ వర్గాల్లో సమాచారం బయటకు వచ్చింది.

మరి దీని ప్రకారం అసలు తాను ఎలాంటి భూమిని దానం ఇవ్వలేదట. ఇప్పుడు ప్రచారం అవుతున్న వార్తలు అన్నీ పూర్తిగా అవాస్తవం అని ఆ భూమికి సంబంధించి కేసు ప్రస్తుతం కోర్ట్ లో నడుస్తోంది అని ఆయన వెల్లడించారు. అందుచేత ఇప్పుడు ఆయన 117 ఎకరాలు దానం చేశారన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఇప్పుడు అందరూ తెలుసుకోవాలి.