వెబ్ సెరిస్ లపై సంచలన వ్యాఖ్యలు చేసిన సుమన్.. వైరల్ అవుతున్న కామెంట్ట్స్…!

ప్రముఖ నటుడు సుమన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పలు సినిమాలలో హీరోగా నటించిన సుమన్ ఎన్నో సినిమాలలో ప్రధాన పాత్రలో నటించి అందరిని మెప్పించాడు. తెలుగు, తమిళ భాషలలో ఎన్నో సినిమాలలో నటించిన సుమన్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా సినిమాల్లో కనిపించడం లేదు. సుమన్హీరోగా మాత్రమే కాకుండా విలన్ గా కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఇటీవల సుమన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇటీవల సుమన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆలిండియా అధ్యక్షుడు ధూళిపాళ్ల దేవేంద్ర భార్య నిర్మల మొదటి వర్ధంతి కార్యక్రమానికి సుమన్ హాజరయ్యారు. తర్వత సుమన్ విలేకరులతో ముచ్చుటించారు.. కరోనా వల్ల గత రెండేళ్లుగా ఓటీటీల ప్రభావం పెరిగిందని.. అందులో వచ్చే వెబ్ సిరీస్, బుల్లితెరపై వచ్చే సీరియళ్లలో అశ్లీలత ఎక్కువగా ఉంది అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ప్రభుత్వం, సెన్సార్ బోర్డ్ ఓటీటీలో వచ్చే వెబ్ సిరీస్, సీరియల్స్ పై దృష్టి పెట్టాలని సుమన్ ఈ సందర్భంగా తెలియచేశారు. ఈ మధ్య కాలంలో యువత ఎక్కువగా ఓటిటిలలో ప్రసారమవుతున్న వెబ్ సిరీస్ లు చూడటానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.

ఓటిటిలో ప్రసారమవుతున్న వెబ్ సిరీస్ లకి, బుల్లితెర మీద ప్రసారమౌతున్న సినిమాలకు సెన్సార్ నిబంధనలు ఒకేలా ఉండాలని ఆయన వెల్లడించారు. అప్పుడే అశ్లీలతని నిర్మూలించవచ్చు అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా యువత, చిన్న పిల్లలు మొబైల్ ఫోన్లలో వెబ్ సిరీస్ లు చూసి వాటి ప్రభావానికి ఎక్కువ గురవుతున్నారు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఓటిటి లో ప్రసారమవుతున్న వెబ్ సిరీస్, బుల్లితెర మీద ప్రసారమవుతున్న సీరియల్స్ లో ఈ మధ్య కాలంలో అశ్లీలత బాగా పెరిగినందు వల్ల సెన్సార్ బోర్డు వారు వాటిపై దృష్టి పెట్టాలని ఆయన చెప్పుకొచ్చాడు.