Hero Suman: ఈ చిత్రంలో నటించడం గర్వంగా ఉంది… సుమన్, భానుచందర్‌!

Hero Suman: కె.పి.ఎన్. చౌహాన్ కథా నాయకుడిగా మరియు దర్శకుత్వం వహించిన చిత్రం సేవాదాస్. శ్రీశ్రీ హథీరామ్ బాలాజీ క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాలో సీనియర్ నటులు సుమన్, భానుచందర్‌లు కీలక పాత్రలు పోషించినట్టు తెలుస్తోంది. ఇటీవలే ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకోవడంతో యూ/ఏ సర్టిఫికేట్ కూడా జారీ చేశారు సెన్సార్ సభ్యులు.

ఇకపోతే బంజారా సంస్కృతిని, ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ‘సేవదాస్’ సినిమాను బంజారా భాషలోనే కాకుండా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ వంటి బహుభాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం నిజంగా అభినందనీయమని నటులు భాను చందర్, సుమన్ అన్నారు. ఈ చిత్రంలో నటించడం నిజంగా తమకు గర్వంగా ఉందని వారు ఆనందం వ్యక్తం చేశారు. అంతే కాకుండా 64 దేశాల్లో 18 కోట్ల బంజారాలతో తీసిన సేవాదాస్ చిత్రం ప్రేక్షకుల మనసును హత్తుకునేలా తీసిని దర్శకనిర్మాతలతో పాటు మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు వారు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

ఇదిలా ఉండగా పలు భాషల్లో తీసిన ఈ సినిమాలో కె.పి.ఎన్. చౌహాన్ హీరోగా, ప్రీతి అస్రాని, వినోద్ రైనా-రేఖా నిరోషి హారోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నట్టు ఇప్పటికే చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా జరిగిన మీడియా సమావేశంలో హీరోహీరోయిన్లు, పలువురు నటులు మరియు దర్శక నిర్మాతలు పాల్గొన్నారు.