తెలంగాణ కాంగ్రెస్ లో ప్రకంపనలు ప్రారంభమైయ్యాయి. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కి మరో భారీ షాక్ తప్పేలా లేదు.
కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి కాంగ్రెస్‌కు ఝలక్ ఇవ్వడానికి సిద్దమౌతున్నారట, కాంగ్రెస్ కి షాక్ ఇచ్చి బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. ప్రస్తుతం కేరళలో ఉన్న జానారెడ్డితో బీజేపీ ఇప్పటికే టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. బీజేపీ ఇచ్చిన ఆఫర్‌కు జానారెడ్డి కూడా సరే అన్నట్లు సమాచారం.
ఈనెల 7 న ఢిల్లీ వెళ్లి, బీజేపీ అగ్రనేతల సమక్షంలో కండువా కప్పుకోనున్నట్లు ఓ జాతీయ మీడియా లో ఓ కథనం ప్రసారం అయింది. అలాగే , త్వరలో జరగబోయే నాగార్జున సాగర్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బరిలోకి కూడా దిగనున్నట్లు తెలిసింది. గత కొంత కాలంగా రాజకీయంగా, పార్టీ కార్యకలాపాల పరంగా స్తబ్దుగా ఉన్న జానారెడ్డి, నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ద్వారా తిరిగి క్రియాశీలం కావాలని డిసైడ్ అయినట్లు అయన సన్నిహితులు చెప్తున్నారు.
దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించి, టిఆర్ ఎస్ కి మేమే సరైన ప్రత్యామ్న్యాయం అని అనిపించుకున్న బీజేపీ,. ఎలాగైనా వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని పటిష్ఠం చేసుకోవాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే వివిధ పార్టీల్లోని సీనియర్లు , కొందరు కీలక నేతలను తమవైపు మళ్లించుకొని, అధికార పీఠానికి చేరువయ్యేలా ఢిల్లీ వ్యూహకర్తలు ప్లాన్ సిద్ధం చేశారు. అందులో భాగంగానే జానారెడ్డిని బీజేపీ కదిపిందని నేతలు చెప్తున్నారు. జానారెడ్డి బీజేపీలో చేరితో తెలంగాణ కాంగ్రెస్ కి గట్టి షాక్ తగిలినట్టే