కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కెప్టెన్ సతీశ్ శర్మ గత రాత్రి గోవాలో కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న సతీశ్ శర్మ 11 అక్టోబరు 1947లో తెలంగాణలోని సికింద్రాబాద్‌లో జన్మించారు. అమేథీ, రాయ్‌బరేలీ నుంచి మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.
రాజ్యసభ సభ్యుడిగానూ పనిచేశారు. 1993 నుంచి 1996 వరకు పీవీ నరసింహారావు కేబినెట్‌లో కేంద్రమంత్రిగా పనిచేశారు. సతీశ్‌శర్మకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఢిల్లీలో రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. సతీశ్ మృతికి పలువురు నేతలు సంతాపం తెలిపారు.
దివంగత ప్రధాని రాజీవ్ గాంధీతో శర్మకు సాన్నిహిత్యం ఉండేది. పీవీ నరసింహారావు ప్రభుత్వంలో పెట్రోలియం, సహాజ వాయువుల ఉత్పత్తి మంత్రిత్వ శాఖను చేపట్టారు. శర్మ ఉమ్మడి ఏపీ 1947 అక్టోబర్ 11వ తేదీన సికింద్రాబాద్‌లో జన్మించారు. కమర్షియల్ పైలట్‌గా ప్రొఫెషనల్ లైఫ్ ప్రారంభించారు. అప్పుడే రాజీవ్ గాంధీతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. రాజీవ్ హత్య తర్వాత 1991లో అమేథీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1998, 2004లో అమేథీ నుంచి పోటీ చేసి.. గెిచారు. 2004 నుంచి 2016 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ నుంచి ఎగువసభకు ప్రాతినిధ్యం వహించారు.