నరేష్ మూడో భార్య రమ్య గురించి అసలు విషయం బయటపెట్టిన సీనియర్ నటి..?

ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రముఖ నటుడు నరేష్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ మద్య ఉన్న సంబంధం హాట్ టాపిక్ గా మారింది. గత కొన్ని రోజులుగా నరేష్, పవిత్ర మీద నరేష్ మూడో భార్య రమ్య తీవ్ర స్థాయిలో అరోపణలు చేస్తోంది. అయితే తాజాగా ఈ విషయం పై అలనాటి ప్రముఖ నటి పూజిత స్పందించారు. ఇటీవల ఓ ఛానల్ కి ఇంటర్వ్యు ఇచ్చిన పూజిత నరేశ్ మూడో భార్య రమ్య గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. నరేశ్ జీవితం లో దేవుడు చాలా లక్ష్మీదేవిని ప్రసాదించాడు.. కానీ మంచి గృహలక్ష్మిని ఇవ్వలేకపోయాడు అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

ఈ క్రమంలో నరేష్ మూడో భార్య రమ్య గురించి మాట్లాడుతూ.. గత ఎనిమిది సంవత్సరాలుగా రమ్య నరేష్ కి దూరంగా ఉంటుంది. నరేష్ ని రమ్య ఒక ఉమెనైజర్ అని అంటుంది. అతన్ని పెళ్లి చేసుకునే సమయంలో రమ్య కి ఇవన్నీ తెలియవా? నరేష్ చాలా సందర్భాల్లో నన్ను ఆదుకున్నారు. నాకు ఒక అన్నలా సహాయం చేశాడు అంటూ పూజిత చెప్పుకొచ్చింది. నరేష్ గారి ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా కూడా నాకు ఆహ్వానం అందుతుంది. నేను వెళ్లిన ప్రతిసారి రమ్య నాకు ఎప్పుడూ కనిపించలేదు. విజయనిర్మల గారు కూడా తనకి సపోర్ట్ చేశారు అని రమ్య చెప్తుంది. మరి నరేష్ విడాకుల కోసం గన్ గురి పెట్టినప్పుడు తన అత్తగారికి ఆ విషయం ఎందుకు చెప్పలేదు అంటూ పూజిత ప్రశ్నించింది.

విజయనిర్మల గారు చనిపోయినప్పుడు మాత్రమే నేను రమ్యని ఆ ఇంట్లో చూశాను. ఆ తర్వాత 11 రోజుల కర్మ జరిగినప్పుడు కూడా రమ్య అక్కడికి రాలేదు అంటూ చెప్పింది. ఇంతకాలం సైలెంట్ గా ఉన్న రమ్య ఇప్పుడు నరేష్ విడాకులు అడగటంతో బయటికి వచ్చి ఇంత రచ్చ చేస్తుంది. హైదరాబాద్ కి చెందిన రమ్య బెంగళూరు వెళ్లి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి పవిత్రని చెడుగా నిరూపించడానికి ప్రయత్నం చేస్తోంది. ముందు నుండి రమ్య ఇదంతా ప్లాన్ చేసి పవిత్ర ఇమేజ్ ని డామేజ్ చేయటానికి ఇలా కర్ణాటకలో ప్రెస్ మీట్ పెట్టింది అంటూ పూజిత ఆరోపించారు. ఇప్పుడు పవిత్ర నరేష్ కి ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా ఆయనతో కలిసి ఉంటుంది. ఒకవేళ వారిద్దరూ పెళ్లి చేసుకుంటే ఆ విషయం నాకు తప్పకుండా తెలుస్తుంది… అంటూ పూజిత రమ్య గురించి అసలు నిజాలు బయట పెట్టింది.