Shekar Kammula: కుబేర రన్ టైమ్ గురించి అలాంటి కామెంట్స్.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇదే!

Shekar Kammula: టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ కుబేర. ధనుష్ హీరోగా నటించిన ఈ మూవీలో రష్మిక మందన హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. అలాగే ఇందులో నాగార్జున కీలక పాత్రలో నటించారు. తాజాగా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా సక్సెస్ అయిన సందర్బంగా ఈ సినిమా సక్సెస్‌ ప్రెస్‌మీట్‌ హైదరాబాద్‌ లో నిర్వహించారు మూవీ మేకర్స్. ఈ సినిమాకు వస్తోన్న పాజిటివ్‌ రిపోర్ట్స్‌పై టీమ్‌ ఆనందం వ్యక్తం చేసింది.

ఇందులో భాగంగా ఈ సినిమా రన్‌టైమ్‌ పై వస్తోన్న కామెంట్స్‌ ను ఉద్దేశించి దర్శకుడు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమాకు అంత నిడివి అవసరమన్నారు. ఈ సందర్బంగా శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. ఇది నాకొక ఎమోషనల్‌ టైమ్‌. మేము ఈ కథ అనుకున్నప్పటినుంచి వాస్తవికతకు దగ్గరగా తీయాలనుకున్నాము. అనుకున్న దానికంటే బడ్జెట్‌ మించిపోయినప్పుడల్లా కథలో ఏదైనా కోతలు విధించాలనుకునేవాడిని. ఆ సమయంలో నా టీమ్‌ నాకెంతో సపోర్ట్‌ గా నిలిచింది. ఈ సినిమాను ఇలాగే రూపొందించాలని ధైర్యాన్ని ఇచ్చింది.

ఇప్పటి వరకు నేను చేసిన చిత్రాల్లో ఇది అద్భుతమైన చిత్రం. నిడివి విషయంలో కొంతమంది కామెంట్స్‌ చేస్తున్నారు. అవసరమైనప్పుడు సినిమాకు కత్తెర వేయాలనేది దర్శకుడు లేదా టీమ్‌ కు తెలియని విషయం కాదు. కానీ, ఆయా సన్నివేశాలు ఉండాలి, చెప్పాలి అనుకున్నప్పుడు దానిని ఆ విధంగా రూపొందించడమే ధర్మం. ఈ సినిమాకు ఇది అవసరం. ఇందులో ఎన్నో కోణాలు ఉన్నాయి. సినిమా విషయంలో గర్వం, సంతోషంగా ఉన్నాను. ఇదొక కంప్లీట్‌ ఫిల్మ్‌. ప్రేక్షకులు సినిమా చూస్తున్నప్పుడు సాగదీతగా ఉందని అనుకోరనుకుంటున్నాను అని శేఖర్‌ కమ్ముల అన్నారు. ఈ సందర్బంగా ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి..