Sekhar Kammula: టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ డైరెక్టర్ల జాబితా తెరస్తే కనుక అందులో తప్పకుండా డైరెక్టర్ శేఖర్ కమ్ముల పేరు ఉంటుంది. ఈయన రొటీన్ సినిమాలు కాకుండా చాలా విభిన్నమైన జానర్ లో సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తూ ప్రేక్షకులను సందడి చేస్తుంటారు. అయితే ఇప్పటివరకు శేఖర్ కమ్ముల ఎన్నో అద్భుతమైన ప్రేమ కథ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు తాజాగా శేఖర్ కమ్ములకు కుబేర అనే సినిమా ద్వారా సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు.
కుబేర సినిమా జూన్ 20వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా హిందీ తమిళ కన్నడ భాషలలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను వేగవంతం చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ధనుష్ రష్మిక హీరో హీరోయిన్లుగా నటించగా, నాగార్జున కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో శేఖర్ కమ్ములకు సంబంధించి ఒక పాత వీడియో వైరల్ అవుతుంది. అయితే ఇందులో భాగంగా ఈయన ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా చేసి తప్పు చేశానని సంచలన విషయాలను బయటపెట్టారు.
శేఖర్ కమ్ముల ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా చేయాలనుకున్నట్టు అయితే తన దగ్గర కథ లేకపోవడంతో తమిళ సినిమాని తెలుగులోకి అనువదించుకొని అనామిక అనే సినిమాని చేశారు ఇందులో నయనతార హీరోయిన్గా నటించారు. అయితే అనామిక సినిమాని నయనతారతో చేసి తప్పు చేశానని శేఖర్ కమ్ముల తెలిపారు. నయనతార లాంటి స్టార్ హీరోయిన్ స్టేటస్ కు సరిపోయే సినిమా ఇది కాదని, శేఖర్ కమ్ముల ఈ సందర్భంగా చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.