Ram Charan and Jr NTR : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీయార్ ఇద్దరూ కలిసి ‘ఆర్ఆర్ఆర్’ కోసం స్ర్కీన్ షేర్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. కొమరం భీమ్‌గా ఎన్టీయార్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ మంచి స్నేహితుల్లా నటిస్తున్నారు ఈ సినిమాలో.
సినిమా రిలీజ్ సందర్భంగా రామ్, భీమ్ అంటూ ఈ సినిమా ప్రమోషన్స్ ఓ రేంజులో మోత మోగిపోతున్నాయ్. ఇదంతా రీల్ ముచ్చట. రియల్ ముచ్చటేంటంటే, ఎన్టీయార్, చరణ్ రియల్ లైఫ్‌లోనూ చాలా మంచి స్నేహితులు. ఆ విషయాన్నే ఎన్టీయార్ చాలా చక్కగా వివరించాడు.
‘మేమిద్దరం మంచి స్నేహితులం..’ కానీ, నిజానికి మేమిద్దరం భిన్న ధృవాలం. చరణ్ చాలా కామ్‌గా వుంటాడు. కానీ, నేను వున్నది వున్నట్టుగా కండ బద్దలుకొట్టేస్తుంటాను. ఎంతటి అగ్నిపర్వతాన్నయినా చరణ్ మనసులో దాచేసుకోగలడు. కానీ, నేను అస్సలు దాచుకోలేను.
బయటపడిపోవాల్సిందే.. అంటూ చరణ్‌లో దాగి వున్న అగ్ని పర్వతాన్నినేను.. అంటూ చాలా చక్కగా తమ స్నేహం గురించి చెప్పాడు ఎన్టీయార్.
హీరోలేమో వారి మధ్య స్నేహ బంధాన్ని అంత చక్కగా ఫీలవుతుంటారు. కానీ, వారి అభిమానులేమో బయట లేని పోని గొడవలతో కొట్టుకు చస్తుంటారు. చాలా సందర్భాల్లో ఇదే విషయాన్ని హీరోలు పదే పదే ప్రస్థావిస్తున్నా అభిమానులు మాత్రం తమ పంథా మార్చుకోవడం లేదు.
హీరోలకు లేని భిన్నత్వం అభిమానులకెందుకు.?
కాగా, ఈ నెల 25న ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్‌కి రెడీగా వున్న సంగతి తెలిసిందే. జక్కన్న చెక్కిన ఈ అద్భుత విజువల్ హంగామా కోసం అటు ఎన్టీయార్ అభిమానులూ, ఇటు చరణ్ అభిమానులూ ఈగర్‌గా ఎదురు చూస్తున్నారు.