Scientific Fact: గుడికి వెళ్లిన వాళ్లు ఎవరైనా కొబ్బరికాయ కొట్టడం అనేది ఆనవాయితీ. చాలామంది ఇలా కొబ్బరి కాయలను తీసుకొని వెళ్తారు. ఇంట్లో పూజ చేసుకున్న సమయంలో కూడా కొబ్బరి కాయ అనేది కొడుతుంటారు. అయితే చాలామంది చూసే ఉంటారు.. కొబ్బరి కాయ కొట్టిన సమయంలో ఒక్కోసారి అందులో పువ్వు వస్తుంటుంది. అయితే ఇలా వస్తే.. చాలామంచిది అని పెద్దలు అంటుంటారు. అలాగే కొబ్బరి కాయ కొట్టిన వాళ్లు కూడా మురిసిపోతుంటారు. ఇలా ఏదో మంచి జరుగుతుందని గట్టిగా నమ్ముతారు. ఒక వేళ అదే కొబ్బరి కాయ కుళ్లి పోతే మాత్రం.. తెగ బాధపడతారు. ఏం జరుగుతుందో అని మదనపడుతుంటారు. ఆ రోజంతా వాళ్లు హుషారు గా కనిపించరు. కీడు జరుగుతుందని పెద్దలు చెబుతుంటారు.
అయితే ఇలా కొబ్బరి కాయ కుళ్లిపోవడం వల్ల ఏమైనా నష్టం జరుగుతుందా.. అసలు దీని వెనుకు ఉన్న సత్యం ఏమిటి తెలుసుకుందాం.. కొబ్బరి కాయ కుళ్లిపోవడం వల్ల.. మీరు అనుకుంటున్నంత అపచారమేమీ లేదట. అసలు భయపడాల్సిన పనేలేదట. జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఏం చెబుతున్నారంటే. ఒక కొబ్బరికాయను కొని.. దేవుడిపై భక్తితో మనం కొడతాం. అయితే కొబ్బరికాయ లోపల ఏముంటుందో ఎవరికీ తెలియదు. కొట్టిన తర్వాత అది కుళ్లిపోతే.. ఆ భక్తుడిది తప్పు ఎలా అవుతుంది..కావాలని ఎవరూ కొట్టరు కదా.. అలా జరిగితే తప్పు కాదని చెబుతున్నారు.
ఇలా కుళ్లిన కొబ్బరి కాయ ఉంటే.. మంచి నీటితో శుభ్రం చేసి మళ్లీ మంత్రోచ్ఛారణతో స్వామి వారిని అలంకరిస్తారట. ఇక వేళ ఇంట్లో మాత్రం కొబ్బరికాయ కొట్టగానే కుళ్లితే .. కుళ్లిన భాగాన్ని తీసి.. పూజా మందిరాన్ని శుభ్రం చేయాలట. అంతే కాదు మళ్లీ కాళ్లు , చేతులు కడక్కొని.. పూజ ప్రారంభించొచ్చు అనేది నిపుణులు చెబుతున్నారు. ఇలా కొబ్బరి కుళ్లిపోయిందని ఎలాంటి దిగులు చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.
