అంబటి రాంబాబు. జగన్ రైట్ హ్యండ్. వైసీపీలో కీలక నేత. జగన్ కు నమ్మకస్తుడు. ఇంత హోదా ఉన్నా.. తన సొంత నియోజకవర్గం నుంచి మాత్రం అంబటికి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పుడే కాదు.. చాలా సార్లు ఆయనపై విమర్శలు వచ్చాయి. దానికి ఆయన ఎన్నోసార్లు వివరణ కూడా ఇచ్చారు. అయినా కూడా ఆయనపై విమర్శలు మాత్రం తగ్గడం లేదు.
నిజానికి.. సత్తెనపల్లి టికెట్ ను అంబటికి ఇవ్వకూడదంటూ అప్పట్లో వైసీపీ నేతలే పార్టీ హైకమాండ్ కు విన్నవించారు. అయినా కూడా జగన్ ఏమాత్రం వినకుండా అంబటికే టికెట్ ఇచ్చారు. చివరకు అంబటి రాంబాబు సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి నెగ్గాడు.. అది వేరే సంగతి.
ఇక.. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంబటిపై వ్యతిరేకత వస్తూనే ఉన్నది. సొంత పార్టీ నేతల నుంచి కూడా ఆయనకు వ్యతిరేకత వస్తున్నది. అయితే.. ఎమ్మెల్యే అయ్యాక.. అంబటి రాంబాబు కూడా తనకు టికెట్ ఇవ్వకూడదని హైకమాండ్ కు ఏ వర్గమైతే విన్నవించిందో.. ఆ వర్గంపై కక్ష సాధింపు చర్యలకు పూనుకున్నారు.. అంటూ ఆరోపనలు వస్తున్నాయి.
ఆ వర్గానికి ఎటువంటి కాంట్రాక్టులు రాకుండా చేయడం, అక్రమంగా కేసులు బనాయించడం లాంటివి చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ వర్గం నేతలు వెంటనే మళ్లీ హైకమాండ్ దగ్గరికి వెళ్లడం… పనులు జరగడం లేదని విన్నవించడం జరుగుతోంది.
అంబటి రాంబాబు ద్వారా పనులు జరగకపోతే.. పార్టీలోని ఇతర సీనియర్ నాయకుల ద్వారా వాళ్ల పనులు చేసుకొని.. అంబటిని తొక్కేయాలని ప్లాన్స్ వేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి.
ఈనేపథ్యంలో అంబటి రాంబాబుపై ఆ వర్గం వాళ్లే హైకోర్టులో అక్రమ మైనింగ్ కేసును కూడా పెట్టారు. సొంత పార్టీ నేతలే ఇలా సొంత పార్టీ నేతలపై కేసు పెట్టడం విచిత్రంగా ఉన్నా.. అంబటి వీళ్లను ఎలా ఎదుర్కోవాలా అని మధనపడుతున్నారట. సత్తెనపల్లిలో అక్రమ మైనింగ్ కు సంబందించి… అంబటి రాంబాబుతో సహా.. పలువురు వైసీపీ నాయకులపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు అయింది. అయితే.. దాన్ని దాఖలు చేసింది కూడా వైసీపీ నేతలే. కాకపోతే అంబటి వర్గం కాదు. వేరే వర్గం.
కావాలని తనపై పనికట్టుకొని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. వాస్తవాలు త్వరలోనే తెలుస్తాయని.. అంబటి చెబుతున్నా.. సొంత పార్టీ నేతలే అంబటి రాంబాబుపై ఇంత గుర్రుగా ఉంటే ఇక ప్రజలు మాత్రం అంబటిని పట్టించుకుంటారా? అనే చర్చ నడుస్తోంది. చూద్దాం.. ఈ కేసు ఎంతవరకు వెళ్తుందో? కోర్టుకు అంబటి ఏం సమాధానం చెబుతారో వేచి చూడాల్సిందే?