మహేష్ నుండి టీజర్ ట్రీట్ లేనట్టే

Sarkaru vaari paata teaser will not be releasing on Mahesh birthday
Sarkaru vaari paata teaser will not be releasing on Mahesh birthday
సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న కొత్త సినిమా ‘సర్కారు వారి పాట’. పరశురాం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.  లాక్ డౌన్ ముందు మొదలైన ఈ సినిమా కొద్దిగా మాత్రమే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.  ఈలోపు లాక్ డౌన్ పడటంతో అది కాస్త నిలిచిపోయింది. అయితే ప్రతి ఏడాది మహేష్ పుట్టినరోజున ఆయన కొత్త సినిమా నుండి ఏదో ఒక ట్రీట్ ఉంటుంది.  అలాగే ఈ ఏడాది ఆగష్టు 9న ‘సర్కారు వారి పాట’ టీజర్ వస్తుందని ఫ్యాన్స్ ఆశించారు. చిత్ర బృందం కూడ టీజర్ విడుదల చేయాలనే అనుకుంది. కానీ లాక్ డౌన్ దెబ్బకు అది కాస్త నెరవేరలా కనిపించట్లేదు. 
 
ఎందుకంటే టీజర్ కట్ చేయడానికి కావాల్సిన కంటెంట్ ఇప్పటివరకు షూట్ చేసిన సినిమాలో లేదట.  జూన్ నుండి షూటింగ్ స్టార్ట్ చేసినా టీజర్ కట్ కుదరదని తెలుస్తోంది.  అందుకే టీమ్ ఫ్యాన్స్ అప్సెట్ అవ్వకుండా మహేష్ బాబు పాత్రకు సంబందించిన ఒక యాక్షన్ టీజర్ రిలీజ్ చేయాలని నిర్ణయించారట.  సో..ఈసారి మహేష్ పుట్టినరోజుకి ఫ్యాన్స్ పెద్ద ట్రీట్స్ లాంటివి ఏవీ ఆశించకపోవడం మంచిది.