“సర్కారు వారి పాట” వాయిదా కన్ఫర్మ్ లానే ఉంది! ఈ డేట్ కి అట

Sarkaru Vaari Paata | Telugu Rajyam
సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు పరశురామ్ పెట్లతో భారీ బడ్జెట్ సినిమా “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఇప్పుడు స్పెయిన్ దేశంలో కీలక సన్నివేశాలు చిత్రీకరణ జరుపుకుంటుంది. అయితే ఈ భారీ చిత్రం రిలీజ్ కి వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ కి ఫిక్స్ కాగా తర్వాత మరిన్ని సినిమాలు రేస్ లోకి రావడం కూడా స్టార్ట్ అయ్యాయి. 
 
అయితే బిగ్ మల్టీ స్టారర్ ట్రిపుల్ ఆర్ సినిమా రాకతో ఈ చిత్రం కూడా వాయిదా ఉంటుంది అని అనుకున్నారు కానీ తర్వాత చిత్ర యూనిట్ నుంచి మాత్రం మళ్ళీ ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా సినీ సర్కిల్స్ లో సినిమా వాయిదా కన్ఫర్మ్ అని తెలుస్తుంది. లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ చిత్రం రిలీజ్ వచ్చే ఏప్రిల్ 28 కి షిఫ్ట్ అయ్యినట్టుగా సమాచారం. 
 

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles