Home News సంక్రాంతి హంగామా ముగిసింది ... ఇక సినిమాల సందడి మొదలైంది !

సంక్రాంతి హంగామా ముగిసింది … ఇక సినిమాల సందడి మొదలైంది !

కరోనా లాక్ డౌన్ తర్వాత థియేటర్లు పున:ప్రారంభం అయినప్పటికీ సినీ పరిశ్రమల్లో అంతగా సందడి కనిపించడం లేదు. థియేటర్లలో సందడి అంతంతమాత్రమే కనిపించింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సంక్రాంతి వేళ థియేటర్లు కళకళలాడుతున్నాయి. ఒకటికి నాలుగు సినిమాలు పండుగ నాడు అందరిని పలకరించాయి. పండుగ తర్వాత కూడా వీటి సందడి కొనసాగుతున్నాయి. వచ్చే రెండు మూడు వారాల్లోనూ సినిమాలు వరుస కట్టనున్నాయి.

Release Problems For Movies Uppena And 30 Rojullo Preminchadam Ela |  థియేటర్స్ ఊపందుకుంటే ఆ రెండు సినిమాల విడుదల కష్టమేనా..? | Tupaki Telugu

సినిమా ఇండస్ట్రీకి అన్ సీజన్ గా భావించే ఫిబ్రవరిలోనూ పెద్ద ఎత్తునే సినిమాలు రేసులోకి దిగుతున్నాయి. రాబోయేవి చిన్న సినిమాలే అయినప్పటికీ సందడేమీ తక్కువగా ఉండబోదు.వచ్చే వారాంతంలో అల్లరి నరేష్ సినిమా ‘బంగారు బుల్లోడు’ ప్రేక్షకుల ముందుకు రానుంది. 23న ఈ చిత్రం విడుదలవుతుంది. ముందు రోజు ‘ఆహా’ ద్వారా ‘సూపర్ ఓవర్’ రిలీజ్ కానుంది. ఇక నెలాఖర్లో రెండు కొత్త చిత్రాలు ప్రేక్షకుల్ని పలకరించనున్నాయి. 29న యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయం అవుతున్న ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ విడుదల కానుంది.

అదే రోజు సుమంత్ థ్రిల్లర్ మూవీ ‘కపటదారి’ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. తర్వాతి వారం మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఉప్పెన’ రిలీజ్ కానుంది. అదే రోజు తెలుగులో తొలి జాంబీ మూవీ ‘జాంబీరెడ్డి’ థియేటర్లలోకి దిగుతుంది. ఇక వేలంటైన్స్ డే వీకెండ్లో ఒకేసారి మూడు చిత్రాలు రేసులో నిలవబోతున్నాయి. ఇప్పటికే ఆ రోజున సందీప్ కిషన్ మూవీ ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’, ఆది సాయికుమార్ చిత్రం ‘శశి’ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోగా.. కొత్తగా జగపతిబాబు సినిమా ‘ఎఫ్‌సీయూకే’ 12కే రిలీజ్ ఖరారు చేసుకుంది. మరోవైపు రిపబ్లిక్ డే కానుకగా నాగార్జున సినిమా ‘వైల్డ్ డాగ్’ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజవుతుందని అంటున్నారు కానీ.. ఇంకా అధికారిక ప్రకటనేమీ రాలేదు. మొత్తంగా రాబోయే నెల రోజుల్లో రెండంకెల సంఖ్యలో కొత్త సినిమాలు ప్రేక్షకులను పలకరించబోతున్నాయన్నమాట.

 

- Advertisement -

Related Posts

షర్మిల పార్టీలో జాయిన్ కానున్న యాంకర్ శ్యామల..?

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కూతురు.. ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైయస్ షర్మిల త్వరలో తెలంగాణలో ఓ రాజకీయ పార్టీని స్థాపించిబోతున్నట్టు ప్రకటించిన సంచలనం రేపింది. అంతేకాదు తాను...

చెపాక్ నుంచి ఎన్నికల బరిలో హీరో ఉదయనిధి స్టాలిన్ !

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో సినిమాలు, రాజకీయాలకు మధ్య విడదీయరాని అనుబంధం ఉంది. అక్కడి వాళ్లు ఇక్కడ.. ఇక్కడి వాళ్లు అక్కడ రావడం అనేది ఎప్పట్నుంచో జరుగుతున్న పనే. ముఖ్యంగా సినిమా వాళ్లు రాజకీయాల్లోకి...

కరోనాతో కన్నుమూసిన మరో ఎంపీ ..తీవ్ర విషాదంలో బీజేపీ శ్రేణులు !

బీజేపీ ఎంపీ నంద్‌కుమార్‌ సింగ్‌ చౌహాన్‌ గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో మంగళవారం ఉదయం కన్నుమూశారు. నంద్‌కుమార్‌ మధ్యప్రదేశ్‌ ఖండ్వ లోక్‌సభ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో భోపాల్‌ నుంచి...

Latest News