అక్కినేని నాగార్జున నటిస్తున్న వైల్డ్ డాగ్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ చిత్రంలో NIA ఏజెంట్‌గా నటిస్తున్నాడు నాగ్. కొత్త దర్శకుడు అహిషోర్ సాల్మన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై నిన్నటి వరకు అంచనాలు పెద్దగా లేవు. కానీ ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత ఒక్కసారిగా అంచనాలు పెరుగుతాయనడంలో సందేహం లేదు. కమర్షియల్ పంథా పక్కనబెట్టి పక్కా దేశభక్తి సినిమాను చేసాడు నాగార్జున. ఈ యాక్షన్ థ్రిల్లర్ ట్రైలర్ చిరంజీవి విడుదల చేసాడు. ‘వైల్డ్‌డాగ్’ ట్రైలర్ చూసిన తర్వాత సినిమా రేంజ్ మారిపోయింది.
ట్రైలర్లో అద్భుతమైన విజువల్స్‌తో పాటు యాక్షన్ సీక్వెన్సులు కూడా కనిపిస్తున్నాయి. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(NIA) ఏజెంట్ విజయ్ వర్మగా నాగార్జున అదరగొట్టాడు. కొందరు సంఘ విద్రోహ శక్తులతో పాటు తీవ్రవాదులతో విజయ్ వర్మ చేసే పోరాటమే వైల్డ్ డాగ్ సినిమా. డిపార్ట్మెంట్లో ఆయన్ని అంత ముద్దుగా వైల్డ్ డాగ్ అంటారు. అందుకే టైటిల్ కూడా అదే అయిపోయింది. ముందు ఈ సినిమాను నేరుగా ఓటిటిలో విడుదల చేయాలని అగ్రిమెంట్ కూడా కుదుర్చుకున్నారు. కానీ థియేటర్స్ ఓపెన్ కావడంతో మనసు మార్చుకున్నారు నిర్మాతలు.
మన దేశంలో వందల మందిని చంపి మీరేమీ చేయలేరు అంటే.. నేను అందుకు అంగీకరించను అంటూ చివర్లో నాగార్జున చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. పైగా ‘మా..త్’ అంటూ బూతును కూడా వాడేసాడు నాగ్. ఇందులో అలీ రెజా, ఆర్యా పండిట్, కాలెబ్ మాథ్యూస్, రుద్రా గౌడ్, హష్వంత్ మనోహర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సయామీ ఖేర్ ఓ కీలక పాత్రలో దర్శనమివ్వనుంది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. ఏప్రిల్ 2న ‘వైల్డ్‌డాగ్’ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ‘వైల్డ్ డాగ్’ ట్రైలర్ ని మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసి చిత్ర యూనిట్ కి విషెస్ తెలియజేసారు. ట్రైలర్ చూసిన తర్వాత ఎప్పట్లాగే తన సోదరుడు నాగార్జున ఇందులో చాలా కూల్‌గా.. ఎనర్జిటిక్‌గా కనిపించాడు.. ఏ జోనర్ సినిమా అయినా చేయడానికైనా భయం లేకుండా ముందడుగు వేసే నటుడు అతను అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు మెగాస్టార్ చిరంజీవి.