‘వైల్డ్ డాగ్’ ట్రైలర్ రిలీజ్ చేయనున్న మెగాస్టార్

నాగార్జున వైల్డ్ డాగ్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వైల్డ్ డాగ్’ సినిమాలో నాగార్జున NIA ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. మ్యాట్నీ ఎంటర్మమెంట్స్ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నాగార్జున డేర్ డెవిల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంతో అహిషోర్ సోల్‌మన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకు కిరణ్ కుమార్ మాటలు అందిస్తున్నారు.

షూటింగ్ పూర్తై.. విడుదలకు సిద్ధమవుతోన్న ఈ చిత్రంలో నాగార్జునకు జోడిగా దియా మీర్జా కథానాయికగా నటిస్తోంది. సయామీ ఖేర్ మరో ముఖ్యపాత్రలో నటిస్తోంది. మన్మథుడు 2 లాంటీ డిజాస్టర్ తర్వాత ఈ సినిమా వస్తుండడంతో మంచి అంచనాలున్నాయి. ఈ సినిమాకు సంబందించి ఆ మధ్య రిలీజ్ చేసిన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ అంద‌రిలో ఆస‌క్తిని రేకెత్తించింది

ఇక ఈ సినిమాను మొదట్లో ఓటీటీలో విడుదల చేస్తామని ప్రకటించిన చిత్రబృందం, ఆ డీల్ ‌ను క్యాన్సల్ చేసుకుని నేరుగా థియేటర్‌లో విడుదలకు రెడీ అయ్యింది. దీనికి సంబంధించిన ఓ ప్రకటన కూడా వచ్చిన సంగతి తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్‌తో ముందుగా రూ. 27 కోట్లకు చేసుకున్న ఒప్పందాన్ని క్యాన్సిల్ చేయించి.. థియేటర్ రిలీజ్ తర్వాత 14 రోజుల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్‌ చేసుకునేలా మళ్లీ ఒప్పందం చేసుకున్నరట. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 2న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ప్రమోషన్స్ కూడా ఊపందుకున్నాయి.

రీలీజ్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది టీమ్. ప్రమోషన్స్ అదిరిపోయేలా ఉండాలని ప్లాన్ చేసిన నాగార్జున తన మిత్రుడు చిరంజీవి సాయం తీసుకోవాలని చూస్తున్నాడు. సినిమా ట్రైలర్ ను చిరంజీవి చేతుల మీదుగా లాంచ్ చేయించనున్నారు. ఈరోజు సాయంత్రం 4: 05 గంటలకు చిరంజీవి ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాతో నాగార్జున ‘బ్రహ్మాస్త్ర’ ఓ హిందీ సినిమాలోను నటిస్తున్నాడు. ఈ సినిమాలో రణ్‌బీర్‌కపూర్‌, ఆలియా భట్‌ నటిస్తున్నారు. నాగార్జున ఈ చిత్రంలో ఆర్కియాలజిస్ట్‌గా నటిస్తున్నారు