కియారా అద్వానీ కి ఎనిమి గా మారిన సమంత?

బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ తెలుగు లో కూడా ‘మహర్షి’, ‘వినయ విధేయ రామ’ లాంటి సినిమాల్తో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం శంకర్, రామ్ చరణ్ పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా షూటింగ్ సగం అయ్యాక శంకర్ ‘ఇండియన్ 2 ‘ సినిమా కోసం ఈ సినిమాను హోల్డ్ లో పెట్టాడు. ఇప్పటికే బడ్జెట్ పెరిగిపోవడంతో ప్రొడ్యూసర్ దిల్ రాజు కి ఏం చెయ్యాలో అర్ధం కావడంలేదు.

తాజా సమాచారం ప్రకారం సినిమాలో కియరా అద్వానికి బదులుగా సమంతని రీప్లేస్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కియరా కోసం అనుకున్న ఆ పాత్రలో ఆమె ఆశించిన స్థాయిలో పర్ఫార్మెన్స్ ఇవ్వలేదని.. అందుకే ఆమె ప్లేస్ లో సమంతని తీసుకున్నారని అంటున్నారు. అయితే దీని పై మూవీ టీం నుండి ఎలాంటి క్లారిటీ రాలేదు.