Samantha -Rashmika: రష్మికకు సర్ప్రైజ్ గిఫ్ట్ పంపిన సామ్…ప్రీగా బోలెడు ప్రమోషన్స్ కొట్టేసిందిగా!

Samantha -Rashmika: సినిమా ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలు అందరూ కూడా మరోవైపు వ్యాపారాలను కూడా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా చాలామంది మేకప్ ప్రోడక్ట్స్ కి సంబంధించిన బిజినెస్ చేయగా మరికొందరు బట్టల వ్యాపారం అలాగే మరి కొంతమంది రెస్టారెంట్ బిజినెస్ చేస్తూ ఉన్నారు అయితే ఇలా వ్యాపారాలు చేసే సెలబ్రిటీలు వారు బిజినెస్ చేస్తున్న ప్రొడక్ట్స్ ఇతర సెలబ్రిటీలకు పంపిస్తూ ఉంటారు.

ఈ విషయంలో విజయ్ దేవరకొండ ముందు వరుసలో ఉంటారని చెప్పాలి. ఈయన రౌడీ బ్రాండ్ తో క్లాత్ బిజినెస్ ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే. ఇలా తన రౌడీ బ్రాండ్ కు సంబంధించిన టీషర్టులను ఎంతోమంది సెలబ్రిటీలకు పంపిస్తూ ఈయన భారీ స్థాయిలో తన బిజినెస్ పెంచుకుంటూ పోతున్నారు.

ఇక ఇదే కోవకు సమంత కూడా చెందుతారని చెప్పాలి. ఈమె కూడా సాకి పేరిట ఒక దుస్తులు వ్యాపారం ప్రారంభించిన విషయం తెలిసిందే అయితే తాజాగా తన బ్రాండ్ నుంచి అందమైన దుస్తులను సినీ నట రష్మిక కోసం కానుకగా పంపించారు అయితే రష్మిక సమంత పంపించిన ఈ దుస్తులను ఫోటోలు తీసి ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేయడమే కాకుండా స్పెషల్ గా సమంతకు థాంక్స్ చెప్పడమే కాకుండా నీకు బిగ్ లవ్ అంటూ చెప్పుకు వచ్చారు.

ప్రస్తుతం రష్మిక షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే రష్మిక వంటి ఒక స్టార్ హీరోయిన్ , నేషనల్ క్రష్ కోసం సమంత తన బ్రాండెడ్ దుస్తులను పంపించి ఫ్రీగానే తన బిజినెస్ ను ప్రమోట్ చేసుకుందనే చెప్పాలి. రష్మిక వంటి స్టార్ హీరోయిన్ చేత ప్రమోషన్ చేయించుకోవాలి అంటే ఆమె కోట్లలో రెమ్యూనరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది కానీ సమంత మాత్రం చాలా తెలివిగా తనకొక డ్రెస్ పంపించి ఫ్రీగా పబ్లిసిటీ చేసుకుందనే చెప్పాలి. ఇక సమంత కథ కొద్దిరోజులుగా సినిమాలకు దూరంగా ఉన్న వ్యాపారాలను మాత్రమే నిర్వహిస్తూ ఉన్నారు. ఈమె పలు వ్యాపార రంగాలలో బిజీగా ఉన్న సంగతి మనకు తెలుస్తుంది.