Samantha: ఒంటరితనం చాలా భయంకరంగా ఉంది… అయినా తప్పలేదు… సమంత సంచలన వ్యాఖ్యలు!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తన భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత ఒంటరి జీవితాన్ని గడుపుతున్న విషయం మనకు తెలిసిందే. ఇలా నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత కొన్ని కారణాల వల్ల తనకు విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉంటున్నారు. అయితే నాగచైతన్య మాత్రం రెండో పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్నారు.

ప్రస్తుతం ఒంటరి జీవితాన్ని గడుపుతున్న సమంత ఒకవైపు సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటున్నారు ఇక సోషల్ మీడియా వేదికగా విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు. ఇటీవల మయో సైటీసిస్ వ్యాధికి గురి అయిన సమంత పూర్తిస్థాయిలో తన ఆరోగ్యం పై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.

ఇలా ఆరోగ్యానికి సంబంధించిన అన్ని విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ అబిమానులకు కూడా కొన్ని సలహాలు సూచనలను ఇస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ సోషల్ మీడియా యుగంలో ఫోన్ లేకుండా ఒక్క క్షణం కూడా మనం ఉండలేము అలాంటిది సమంత మాత్రం నెలలో మూడు రోజుల పాటు ఫోన్ లేకుండా గడుపుతానని వెల్లడించారు. ఫోన్ లేకుండా గడిపిన తర్వాత తన అనుభవాలను గురించి ఈమె బయటపెట్టారు.

ఫోన్, కమ్యూనికేషన్ లేకుండా ఉండడం కష్టం.. మనతో మనం ఒంటరిగా ఉండడం చాలా కష్టం.. అయిన కూడా ఎంతో గొప్పగా అనిపించిందని సమంత వెల్లడించారు అందుకే నేను ఈ విషయం గురించి ప్రతి ఒక్కరికి కూడా సలహాలు ఇస్తున్నానని తెలిపారు. ఇలా ఓ మూడు రోజులు సైలెన్స్ మెయింటైన్ చేయాలని.. ఇది ఎంతో అద్భుతంగా అనిపిస్తుందని సమంత సలహా ఇచ్చారు. ప్రస్తుత కాలంలో ఫోన్ లేకుండా ఉండడం అనేది చాలా కష్టం. మరి సమంత సలహాను ఎవరైనా పాటిస్తారా అనేది చూడాలి. ప్రస్తుతం సమంత ది ఫ్యామిలీ మెన్ 3 సిరీస్ తో పాటు మరికొన్ని వెబ్ సిరీస్ లకు కమిట్ అయ్యారు అలాగే తన నిర్మాణ సంస్థలో సమంత ఓ సినిమాని కూడా చేస్తున్నారని తెలుస్తోంది.