Samantha Movies : హాలీవుడ్ లెవెల్లో సామ్ భారీ సినిమాలు..డీటెయిల్స్ ఇవే..!

 Samantha Movies : సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్స్ లో తన సినిమాలకంటూ స్పెషల్ క్రేజ్ ను ఏర్పర్చుకున్న హీరోయిన్స్ లో సమంతా రూత్ ప్రభు కూడా ఒకరు. అయితే సామ్ ఎప్పుడైతే తన వైవాహిక జీవితం నుంచి బయటకి వచ్చిందో అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అనూహ్యమైన భారీ ఆఫర్స్ తో సమంత తన కెరీర్ లో ముందు ఎప్పుడు చెయ్యని ప్రాజెక్ట్స్ చేస్తూ ఆశ్చర్యపరుస్తూ వెళ్తుంది.
మరి ఇదిలా ఉండగా ఈమె చేస్తున్న సినిమాల్లో భారీ పాన్ ఇండియా సినిమా ఒకటి ఉంది. అదే “యశోద”. హరి శంకర్ మరియు హరి నారాయణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా భారీ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతుండగా లేటెస్ట్ గా ఈ సినిమాకి హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ యానిక్ బెన్ తో ఓ కీలక సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నారట.
ఇది సినిమాలో ఒక బిగ్ హైలైట్ గా నిలుస్తుందని తెలుస్తుంది. ఇక ఇదిలా ఉండగా సమంతా చేస్తున్న మరో భారీ సినిమా “శాకుంతలం” పై కూడా కీలక అప్డేట్ తెలుస్తుంది. ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
అలాగే గుణశేఖర్ సినిమాలు అంటే భారీ సెట్టింగ్స్ కి పెట్టింది పేరు అలానే ఈ సినిమాకి కూడా కనీవినీ ఎరుగని రీతి సెట్టింగ్స్ వేస్తున్నారట. ఇవి కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉంటాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి అయితే సమంతా ఈ రెండు బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ మంచి వైరల్ అవుతున్నాయి.