రాజుగారికి ఇది గట్టి దెబ్బె!

సమంత లీడ్ రోల్ లో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన శాకుంతలం మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చి డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా ప్రేక్షకులని ఏ మాత్రం మెప్పించలేకపోయింది. భారీ బడ్జెట్ తో విజువల్ గ్రాండియర్ గా సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించిన కూడా ప్రేక్షకులు మూవీని తిరస్కరించారు. దీనికి కారణంగా కంటెంట్ లో దమ్ము లేకపోవడమే అని చెప్పాలి.

అలాగే శాకుంతలం కథనం పరంగా కూడా ఎక్కడ ఇంట్రెస్ట్ ని గుణశేఖర్ క్రియేట్ చేయలేకపోయారు. అస్సలు రుద్రమ్మదేవి సినిమాలో ఉన్న మ్యాజిక్ ఈ మూవీలో కంప్లీట్ గా మిస్ అయ్యింది. ఈ సినిమాకి 80 కోట్ల వరకు బడ్జెట్ అయ్యిందని గుణశేఖర్ ఇంటర్వ్యూలలో తెలిపారు. అందులో సగం దిల్ రాజు పెట్టారని పేర్కొన్నారు.

అయితే మూవీపై 20 కోట్ల వరకు మాత్రమే బిజినెస్ జరిగింది. అయితే తక్కువ బ్రేక్ ఎవెన్ తో బరిలోకి దిగిన శాకుంతలం కనీసం 5 కోట్లు కూడా కలెక్ట్ చేయలేకపోయింది. ఇక ఈ మూవీని గుణశేఖర్ సొంత ప్రొడక్షన్ లోనే స్టార్ట్ చేశారు. అయితే దర్శకుడి మేకింగ్ విజన్, ప్లానింగ్ నచ్చి మధ్యలో దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ లో భాగం అయ్యారు. అతను కూడా కొంత పెట్టుబడి పెట్టడానికి రెడీ కావడంతో సినిమాని త్రీడీలో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు.

దానికోసం అదనంగా ఖర్చు చేశారు. అయితే దర్శకుడు చెప్పినట్లు 80 కోట్లు కాకున్నా కచ్చితంగా 50 కోట్ల వరకు బడ్జెట్ పెట్టి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఎంత పెట్టిన కూడా ఇప్పుడు ఈ మూవీ కారణంగా దిల్ రాజుకి తక్కువలో తక్కువ 20 నుంచి 30 కోట్ల వరకు నష్టం వచ్చినట్లే అనే మాట వినిపిస్తోంది. ఈ ఏడాది బలం సినిమాతో 25 కోట్ల వరకు కొలల్గొట్టిన దిల్ రాజు దసరా మూవీ డిస్టిబ్యూటర్ గా కూడా మంచి లాభాలు ఆర్జించారు. అలాగే వారిసు మూవీ కూడా నిర్మాతగా లాభాలు తెచ్చిపెట్టింది.

ఇలా ఈ ఏడాది దిల్ రాజుకి భాగా కలిసొస్తుంది అనుకునే లోపే శాకుంతలం రూపంలో భారీ దెబ్బ తగిలిందనే మాట వినిపిస్తోంది. అయితే శాకుంతలం నష్టం అంతా దిల్ రాజు స్వయంకృతం అనే టాక్ ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. శాకుంతలం లాంటి రొటీన్ లవ్ డ్రామాని తెరపై ఆవిష్కరించడం రిస్క్ అని మొదటి నుంచి అందరూ అంచనా వేస్తున్నారు. అలాంటి ప్రాజెక్ట్ లో గుణశేఖర్ అడగకుండానే దిల్ రాజు దూరి పెట్టుబడి పెట్టి కోట్లు నష్టపోయారని ఫిల్మ్ నగర్ సర్కిల్ లో వినిపిస్తోన్న మాట.