స్టార్ హీరోయిన్ సమంత తాజా చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో ప్రయోగాత్మక పాత్ర చేసింది సామ్. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రేక్షకులముందుకు రాగా.. తొలి రోజు మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ ‘శాకుంతలం’ సినిమా కలెక్షన్స్ అన్ని ఏరియాల్లో ఓపెనింగ్స్ బాగానే వచ్చినా తొలిరోజు ఆశించిన మేర రిజల్ట్ రాలేదని మాత్రం కలెక్షన్ రిపోర్ట్స్ స్పష్టం చేశాయి.
తొలి రోజుతో పోల్చితే రెండో రోజుకు వచ్చే సరికి ఆ కలెక్షన్స్ లో సగానికి సగం డ్రాప్ కనిపించింది. మూడో రోజు కలెక్షన్స్ నిలకడగా ఉన్నాయని తెలిసింది. ఆదివారం వీకెండ్ కావడంతో థియేటర్ల వద్ద కాస్త జనం తాకిడి కనిపించింది. దీంతో రెండో రోజుతో పోల్చితే మూడో రోజు పెద్దగా డ్రాప్ కనిపించలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 40 లక్షల మేర నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. విడుదలకు ముందు ఈ సినిమా 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ పెట్టుకొని రంగంలోకి దిగింది. కాబట్టి ఇంకో 16 కోట్ల మేర వస్తే ఈ సినిమా క్లీన్ హిట్ అని చెప్పుకోవచ్చు. సెలవు దినాలు అయినా కలెక్షన్స్ పరంగా శాకుంతలం మార్క్ అయితే కనిపించడం లేదు. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ చూస్తే.. నైజాంలో 4 కోట్లు, సీడెడ్ 1.50కోట్లు, ఆంధ్ర 5.00కోట్లు, ఏపీ,తెలంగాణ 10.50కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 1.20 కోట్లు, మిగిలిన భాషల్లో 4.00 కోట్లు, ఓవర్సీస్ 1.80 కోట్లు, వరల్డ్ వైడ్ టోటల్ 18 కోట్ల బిజినెస్ జరిగింది.
గుణ టీమ్ వర్క్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, గౌతమి, మధుబాల, అదితి బాలన్, అనన్య నాగళ్ల, జిస్సు సేన్ గుప్తా తదితరులు కీలక పాత్రలు పోషించారు. పాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ మూవీతో అల్లు అర్జున్ డాటర్ అల్లు అర్హ మొదటిసారి ప్రేక్షకుల ముందుకొచ్చింది. శకుంతలగా సమంత, దుశ్యంతుడిగా దేవ్ మోహన్ నటించగా.. అల్లు అర్హ భరతుడి పాత్రలో కనిపించింది. దీంతో అందరి దృష్టి ఈ చిన్నారిపై పడింది. అర్హ రోల్ పై పాజిటివ్ టాక్ వచ్చింది.